: మిడ్ క్యాప్ కేటగిరిలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మదర్సన్ సుమీ వైరింగ్ ఇండియా లిమిటెడ్ (Motherson Sumi Wiring India Limited) తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై బోనస్ షేర్లకు ఆమోదం తెలుపారు. తాజాగా ఈ బోనస్ షేర్ల జారీ రికార్డు తేదీని సైతం నిర్ణయించారు. దీంతో ఈ స్టాక్ ఇవాళ్టి ట్రేడింగ్ లో ఫోకస్ లో ఉండనుంది. మరోవైపు ఈ కంపెనీ షేరు వారంలోనే 10 శాతం లాభాన్ని అందించింది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం..అంటే రికార్డు తేదీ నాటికి రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉన్న 2 ఈక్విటీ షేర్లను తమ డీమ్యాట్ ఖాతాలో కలిగి ఉన్న వారికి అదనంగా రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండే 1 ఈక్విటీ షేరుని ఉచితంగా బోనస్ రూపంలో జారీ చేస్తారు. ఇందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే ఈ అర్హులైన వాటాదారులకు అందించేందుకు అవసరమైన రికార్డు డేట్ జూలై 18, 2025గా కంపెనీ బోర్డు నిర్ణయించింది. అలాగే జూలై 21 నాటికి బోనస్ షేర్లు షేర్ హోల్డర్స్ ఖాతాల్లో క్రెడిట్ చేస్తామని కంపెనీ తెలిపింది.ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ.77 వద్ద ఉండగా.. కనిష్ఠ ధర రూ. 46.08 వద్ద ఉంది. గత నెల రోజుల్లో ఈ షేరు 4 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఆరు నెలల్లో 12 శాతం మేర లాభపడింది. గత ఏడాది కాలంలో 11 శాతం నష్టపోయింది. గత ఐదేళ్ల కాలంలో 39 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 28,560 కోట్లుగా ఉంది.అయితే, ఈ కథనం కేవలం సమాచారం కోసమే. ఎవరిని పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించేందుకు కాదు. స్టాక్ మార్కెట్లో హైరిస్క్ ఉంటుంది. చిన్న మిస్టేక్ చేసినా మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. పూర్తి అవగాహనతో, నిపుణుల సలహాలు పాటిస్తూ ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే లాభాలు అందుకునేందుకు అవకాశం లభిస్తుంది.