Worlds Billionaires: అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామికవేత్తల సంపద గణనీయంగా పెరుగుతోంది. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2025లో కీలక మార్పులు జరిగాయి. ఈ లిస్ట్‌లోని బిలియనీర్ల సంఖ్య 3028కి పెరగడం కుబేరుల సంపద ఏ స్థాయిలో పెరుగుతుందో చెప్పవచ్చు. వీరి మొత్తం సంపద విలువ 16.1 లక్షల కోట్ల డాలర్లుగా ఉందని ఫోర్బ్స్ రిపోర్ట్ పేర్కొంది. 2025 జూలైకుసంబంధించిన జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది.ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే మస్క్ సంపద 16 బిలియన్ డాలర్లు తగ్గినప్పటికీ 407 బిలియన్ డాలర్లు (రూ.34.6 లక్షల కోట్లు)తో అగ్రస్థానంలోనే ఉన్నారు. 2024 మే నెలలో 400 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటిన తొలి వ్యక్తిగా మస్క్ నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలోకి కొత్త వ్యక్తి దూసుకొచ్చారు. ఒరాకిల్ సహ వ్యవస్థపాకులు లారీ ఎలిసన్ తన సంపదను భారీగా పెంచుకుని 4వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకారు. జూన్‌తో పోలిస్తే ఒరాకిల్ షేరు 32 శాతం మేర పెరిగి 56 బిలియన్ డాలర్ల సంపద పెరిగింది. దీంతో ఆయన రెండో స్థానంలోకి వచ్చారు. ఇక ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ ఎన్‌విడియా సీఈఓ, కో ఫౌండర్ జెన్సెక్ హువాంగ్ సంపద 20 బిలియన్ డాలర్లు పెరగడంతో 10వ స్థానానికి చేరుకున్నారు. ఇక టాప్-10 కుబేరుల సంపద విలువ 100 బిలియన్ డాలర్లు పెరిగి 2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. మరోవైపు.. 7 రోజుల్లోనే దాదాపు 30 శాతం మేర అంటే 52 బిలియన్ డాలర్లు సంపద తగ్గడంతో టాప్ 10 సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్‌కు స్థానం దగ్గలేదు. ఆయన సంపద ప్రస్తుతం 124 బిలియన్ డాలర్లుగా ఉంది. తన సంపదలో ఎక్కువ మొత్తం గేట్స్ ఫౌండేషన్ ద్వారా దాతృత్వ కార్యక్రమాలకే వెచ్చిస్తాని ఇటీవలే ప్రకటించారు బిల్ గేట్స్. ఆసియా నుంచి ఒకే ఒక్కడు.. ఆయన సంపద ప్రస్తుతం 116 బిలియన్ డాలర్లుగా ఉంది. 100 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8.85 లక్షల కోట్లు) క్లబ్‌లో ఉన్న ఏకైక ఆసియా వాసిగా నిలిచారు. మిగితా వారంతా 100 బి.డాలర్ల మార్క్ దాటలేకపోయారు. ఇక భారత్ విషయానికి వస్తే ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో ఉండగా అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ 67 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచ కుబేరుల్లో ఆయన 24వ స్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత దేశీయంగా 38 బిలియన్ డాలర్లతో శివ నాడార్ మూడో స్థానంలో ఉన్నారు.