రిలయన్స్ జియో ఐపీఓ.. విలువ ఏకంగా రూ. 8.5 లక్షల కోట్లు.. ఇన్వెస్టర్లకు మళ్లీ నిరాశే!

Wait 5 sec.

: . రాబోయే ఐదేళ్లలో రిలయన్స్ నుంచి రిటైల్, జియో కంపెనీలు లిస్టింగ్ అవుతాయని దిగ్గజ పారిశ్రామిక వేత్త, బాస్ ముకేశ్ అంబానీ ప్రకటించినప్పటి నుంచి పట్ల మదుపరుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ఎప్పటికప్పుడు ఈ ప్రణాళికలు వాయిదా పడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా జియోను పబ్లిక్ ఇష్యూకు తీసుకురాకూడదని రిలయన్స్ భావిస్తోందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ 'రాయిటర్స్' ఒక కథనం ప్రచురించింది. ఇది జియో ఐపీఓ కోసం ఎదురుచూస్తున్న వారికి మరోసారి నిరాశను మిగిల్చే వార్త.టెలికాం రంగంలో అతిపెద్ద కంపెనీ అయినటువంటి జియో విలువను అనలిస్టులు 100 బిలియన్ డాలర్లుగా పేర్కొంటున్నారు. ఈ మొత్తాన్ని ఐపీఓకు ముందే మరింత పెంచుకోవాలని కూడా జియో ప్లాట్‌ఫామ్స్ భావిస్తోంది. టెలికాం విభాగంలో అధిక ఆదాయం సాధించడంతో పాటు సబ్‌స్క్రైబర్ల బేస్‌ను మరింత పెంచుకోవడం ఇందులో మొదటి లక్ష్యంగా ఉంది.జియో ప్లాట్‌ఫామ్స్‌కు వచ్చే వార్షిక ఆదాయంలో దాదాపు 80 శాతం ఆదాయం టెలికాం వ్యాపారం నుంచే వస్తుంది. ఈ సంస్థ టెలికాం వ్యాపారంతో పాటు వివిధ యాప్స్‌ సహా కనెక్టెడ్ డివైజులు, ఎంటర్‌ప్రైజెస్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సొల్యూషన్లను కూడా అందిస్తోంది. వీటిని కూడా విస్తరించాలని, తద్వారా రెవెన్యూను పెంచుకోవాలనుకుంటోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న జియో ఐపీఓ ప్రణాళికలుజియోను ఐపీఓకు తీసుకురావాలనుకుంటున్న విషయాన్ని 2019లో అంబానీ ప్రకటించారు. అయితే, ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూకు పక్కాగా తీసుకొస్తారన్న వార్తలు బలంగా వినిపించాయి. కానీ, ఇప్పటి వరకు కూడా ఐపీఓ దిశగా.. ఎలాంటి చర్యలూ చేపట్టలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఐపీఓకు రాకపోవచ్చని ఒకరు పేర్కొనగా, 2027 లేదా 2028కు ముందు కూడా రావడం కష్టమేనని మరొకరు పేర్కొనడం గమనార్హం.జియో ఎప్పుడు వచ్చినా అతిపెద్ద ఐపీఓగా నిలవడం ఖాయం అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ తన విలువను మరింత పెంచుకోవడానికి, వ్యాపార విస్తరణపై దృష్టి సారించినందున ఐపీఓ వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది.