డీఎస్సీ 2025పై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్.. అధికారంలోకి వచ్చాక విచారణ కమిషన్..

Wait 5 sec.

కూటమి ప్రభుత్వం నిర్వహించిన చేశారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిపించి, అన్నింటా సక్సెస్‌ అయిన అనేక మంది రాకపోవడం అత్యంత హేయమని మండిపడ్డారు. పలువురు డీఎస్సీ అభ్యర్థులతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఇష్టారాజ్యంగా జీవోలు జారీ చేసి, స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని, దీంతో ఎంతోమంది అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. వారి తరపున వైసీపీ న్యాయ పోరాటం చేస్తుందని.. ఇందుకోసం లీగల్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే, విచారణ కమిషన్ ఏర్పాటు చేసి.. ఈ అక్రమాలపై దర్యాప్తు జరుపుతామని, అన్యాయానికి గురైన అభ్యర్థులకు అవసరమైతే అదనపు పోస్టులు ఇస్తామని జగన్ ప్రకటించారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్న జగన్.. ఆ రోజు ఎలాంటి వివాదాలు రాలేదని, అంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామన్నారు. చంద్రబాబు కేవలం16 వేల ఉద్యోగాల్లో ఇన్ని అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. డీఎస్సీ అభ్యర్థుల తరుఫున వారికి ఖర్చులేకుండా తామే న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో తొలుత ఒక జీవో ఇచ్చి పరీక్ష లేకుండా కేవలం సర్టిఫికేట్ల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్న జగన్.. ఆ తర్వాత మరో జీవో ఇచ్చి పరీక్షలు రాయాలని చెప్పారన్నారు. డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లేదన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. పరీక్షకు ముందే పేపర్లు లీక్‌ చేయడం, ఆ తర్వాత ఇష్టానుసారం జీవోలు ఇవ్వటం, 1:1 పద్ధతిలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి, అన్నీ కరెక్టుగా ఉన్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడం, మెరిట్‌ వాళ్లను కాకుండా కింద ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వడం, వాటిపై ప్రశ్నిస్తే స్పష్టమైన సమాధానాలు చెప్పకపోవడం జరిగాయని జగన్ ఆరోపించారు. అర్హులైన అభ్యర్థుల తరుఫున వైసీపీ నిలబడుతుందన్న జగన్.. తాము అధికారంలోకి వచ్చాక అవసరమైతే వారికి అదనపు పోస్టులు ఇస్తామన్నారు. 1998 డీఎస్సీలో అన్యాయమైనవారికి న్యాయం చేసిన తరహాలోనే 2025 డీఎస్సీ అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.