‘పవన్ కళ్యాణ్‌ను విమర్శించిన వాళ్లు ఏమైపోయారో చరిత్ర తెలుసుకోండి’.. ప్రకాష్ రాజ్‌కు నటి హేమ స్ట్రాంగ్ కౌంటర్

Wait 5 sec.

నటుడు ప్రకాష్ రాజ్‌ తాజాగా సోషల్‌ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలోనూ జనసేన పార్టీ ఉంటుందని.. రానున్న ఎన్నికల్లో ఇక్కడ కూడా పోటీ చేస్తామని ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రకాష్ రాజ్‌ పరోక్షంగా స్పందించారు. . ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.“మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి'' అని ప్రకాష్ రాజ్ గురువారం ఎక్స్ లో ఓ ట్వీట్ పెట్టారు. ఇక్కడ ఆయన , జనసేన పార్టీ లేదా తెలంగాణ పేర్లను ప్రస్తావించలేదు. అయినప్పటికీ గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే ప్రకాష్ రాజ్ పరోక్షంగా ఈ ట్వీట్ చేశారని అందరూ భావిస్తున్నారు. దీంతో పవన్ కు మద్దతుగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రంగంలోకి దిగారు. వారిలో హేమ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ని 'దొర' అని సంబోధిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన విమర్శలను హేమ ఖండించారు. రాజకీయ విధానాలపై, ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్యబద్ధమే అయినప్పటికీ, వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ప్రజాదరణను గుర్తు చేస్తూ.. గతంలో ఇలాంటి విమర్శలు చేసిన వారికి పట్టిన గతే పడుతుందని ప్రకాష్ రాజ్ ను హెచ్చరించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ''హలో ప్రకాష్ రాజ్ గారు.. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసిన ట్వీట్ చూశా. మనసు చివుక్కుమంది. పవన్ కళ్యాణ్ ని 'దొర' అని సంబోధించడం వెనక మీ వెటకారం అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో 'దొర' అనే పదాన్ని ఏ ఉద్దేశంతో వాడతారో మీకు తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా విమర్శించండి.. తప్పులేదు. కూటమి ప్రభుత్వం విధానాల్ని, జనసేన పార్టీ నిర్ణయాలని కూడా విమర్శించండి.. తప్పులేదు. కానీ వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నించకండి.. ప్లీజ్. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసో లేదో కానీ.. కోట్లాది మంది ప్రజలకి తెలుసు. మీరు చదవరు కదా. గతంలో ఈ తరహా విమర్శలు చేసిన వాళ్లు ఏమైపోయారో చరిత్రలో చదవండి. మీకే అర్థమవుతుంది'' అంటూ హేమ ఈ వీడియోలో చెప్పుచ్చారు. ప్రకాష్ రాజ్‌కు నటి హేమ చరకలు అంటించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇస్తూ ఇంతకముందు బండ్ల గణేష్ ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి దాంట్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరంటూ బండ్ల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో జోక్యం చేసుకుని జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి మీరేమైనా కలెక్టరా లేక దేశ ప్రధానా అంటూ మండిపడ్డారు. మీ సంగతి మీరు చూసుకోండి, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయండని హితవు పలికారు. ఈ క్రమంలో .