జనసైనికులకు పవన్ కళ్యాణ్ శుభవార్త.. వినూత్న ఆలోచన, చాలా మంచి నిర్ణయం!

Wait 5 sec.

జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను నియమించారు. ఈ కమిటీల ద్వారా పార్టీ బలోపేతంతో పాటుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జనసైనికులు, సాధకులు, నాయకులకు తగిన గుర్తింపు, బాధ్యతలు కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 25 లోక్‌‌సభ స్థానలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఉంటాయి. ఈ కమిటీలను జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నేతల సేవలు, నాయకత్వ లక్షణాలు, పార్టీ పట్ల అంకితభావం వంటి అంశాలపై సమాచారాన్ని సేకరిస్తారు. అనంతరం ఆ సమాచారాన్ని పార్టీ అధ్యక్షుల పరిశీలనకు పంపించనున్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి 28మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. వీరిలో ఒక పరిశీలకుడితో పాటుగా ముగ్గురు సీనియర్ నేతలు ఉంటాయి. అలాగే ప్రతి ఏటా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో యాక్టివ్‌గా ఉండే మరో ముగ్గురు సాధకులు.. సమన్వయం చేస్తూ పనిచేసే 21 మంది సాధకులతో ఈ కమిటీని రూపొందించారు. ఈ కమిటీలకు సంబంధించి పరిశీలకులుగా నేతల్ని నియమించారు. అంతేకాదు ఈ కమిటీలలో వీరమహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలు ఇచ్చే సమాచారాన్ని పరిశీలించి, పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కష్టపడిన ప్రతి జనసైనికుడికి గుర్తింపు లభించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. గతంలోనే రూపుదిద్దుకున్న ఆలోచనకు కార్యరూపం ఇస్తూ పవన్ కళ్యాణ్ ఈ సరికొత్త ఆలోచన చేశారు. సఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం నాలుగు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించి స్థానాల కేటాయింపుపై ఎన్డీయే సమన్వయ సమావేశంలో నిర్ణయమైంది. ఒక స్థానం జనసేనకు కేటాయించారు. ఈ స్థానానికి అభ్యర్థి ఎవరు అనేది పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు. ఆ తరువాత పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కూటమి పార్టీల మధ్య స్థానాలపై చర్చ జరిగింది. అప్పటి ఎన్నికల్లో సర్దుబాటుల్లో భాగంగా జనసేన తాను పోటీ చేయవలసిన లోక్ సభ స్థానాలను త్యాగం చేసింది. లోక్ సభ స్థానాలు త్యాగం చేసిన క్రమంలో రాజ్య సభలో స్థానాలు కల్పించేలా చర్చ జరిగింది. ఇందుకు సంబంధించిన అవగాహనలో భాగంగా 2024-29 మధ్య ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చే రాజ్యసభ స్థానాలలో మూడు జనసేనకు కేటాయించేలా నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి రాజ్యసభ స్థానం ఈ దఫా ఎన్నికల్లో దక్కింది' అని జనసేన పార్టీ తెలిపింది.