ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వరుసగా 3వ సారి వడ్డీ రేట్లు యథాతథం

Wait 5 sec.

RBP MPC: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మానీటరీ పాలసీ కమిటీ సమావేశంలోని నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతం వద్ద ఉండగా అదే స్థాయిలో కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కీలక పాలసీ రేట్లు సవరించకపోవడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హాం. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. ఈ ఏడాది 2026, ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో జరిగిన ద్వైమాసిక సమీక్షా సమావేశాల్లోనూ ఈ పాలసీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే, గత ఏడాది కాలంలో మాత్రం వడ్డీరేట్లను పలు మార్లు సవరించింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించింది. ఆ తర్వాత జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత విధించింది. ఆ తర్వాత డిసెంబర్ 2025లో జరిగిన సమావేశంలో మరో 25 పాయింట్లు కోత విధించింది. మొత్తం 1.25 శాత మేర రెపో రేటును తగ్గించింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏర్పడుతున్న పరిణామాల వేళ వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది.