లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి.. నిజమని తేలితే రూ.10 కోట్లు ఇస్తా.. పవన్ కళ్యాణ్‌కు కేవీపీ ఛాలెంజ్

Wait 5 sec.

మాజీ ముఖ్యమంత్రి మాజీ ఎంపీ కేవీవీ రామచంద్రరావు స్పందించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తన ప్రసంగంలో రాజశేఖర్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు అసత్యమని కేవీపీ స్పష్టం చశారు. మీరు సత్యమని నమ్ముతున్న అసత్య ఆరోపణలను ఖండించక తప్పడం లేదంటూ లేఖ రాశారు.లేదన్న ..చాలామంది లాగానే పవన్ కళ్యాణ్ కూడా గుర్తించడంలో విఫలం అవుతున్నారని అన్నారు. "మీరు ఏదో చికిత్స నిమిత్తం.. ఆసుపత్రిలో చేరింది, 2005 లోనో, 2006 లోనో గుర్తు లేదు అన్నారు. కానీ, అప్పుడు రిలీజ్ అయిన మీ సినిమా పేరు మాత్రం కరెక్ట్‌గా చెప్పారు. అలాగే ఇందిరాగాంధీ మెదక్ లోనూ, రాహుల్ గాంధీ. ప్రియాంక గాంధీ వయనాడ్‌లోనూ, పీవీ నరసింహారావు నంద్యాలలోనూ పోటీ చేశారని చెప్పి.. డా. పి.శివశంకర్ 1998లో తెనాలి పార్లమెంటుకు పోటీచేసి గెలిచిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.. మీకు తెలియదో, ఇది కూడా మర్చిపోయారో తెలియదు. ""రాజశేఖరరెడ్డి పేరును ప్రస్తావిస్తూ, ఒక పోలీస్ ఉన్నతాధికారి మీకు ఏదో చెప్పాడని, మీరు అమాయకంగా అది నమ్మలేదని.. అయితే రెండు సంవత్సరాల తరువాత అది నిజమైందని చెప్పారు. దీన్ని నిశితంగా పరిశీలిస్తే పూర్తి అసత్యమని తెలుస్తోంది.. నాకు, రాజశేఖరరెడ్డి అభిమానులకు గుర్తున్నంతవరకు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు మీ మీద, మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప, ఎలాంటి తప్పుడు రాజకీయ కేసులు బనాయించినట్లు ఆధారాలు లేవు. కానీ, కేసులు బనాయించారని మీరు ఒక ఆరోపణ చేశారు." అంటూ కేవీపీ లేఖలో పేర్కొన్నారు.జలగం వెంగళరావు నుంచి రేవంత్ రెడ్డి వరకూ ఎంతో మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులను చూశానన్న కేవీరీ.. ఎవరూ కూడా తమ రాజకీయ ప్రణాళికల గురించి అలా పోలీసు ఆఫీసర్లతో చర్చించరని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ఒక పోలీసు అధికారితో అలా అన్నారనడం పూర్తిగా సత్య దూరమని.. పవన్ కళ్యాణ్ ఆరోపణల వెనుక ఉన్న నిజానిజాలను నిగ్గు తేల్చడానికి ఆయనకు చెప్పిన పోలీస్ అధికారికి "లై డిటెక్టర్" పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. లైడిటెక్టర్ టెస్టులో పవన్ కళ్యాణ్ ఆరోపించిన విధంగా రాజశేఖరరెడ్డి చెప్పారని చెపితే.. వైఎస్ఆర్ అభిమానులతో కలిసి తాను 10 కోట్ల రూపాయలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు గానీ స్వచ్ఛంద సంస్థకు గానీ ఇచ్చేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. వైఎస్ఆర్ గురించి పవన్ కళ్యాణ్ తన ఆరోపణలు నిజమని నమ్మితే ఛాలెంజ్ స్వీకరించాలని కేవీపీ అన్నారు. 2005- 2006లో సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఆదరణకి.. పవన్ కళ్యాణ్ గురించి, వారి భవిష్యత్తు రాజకీయ ప్రణాళికల గురించి ఆలోచించే అవసరం, తీరిక లేవన్నారు కేవీపీ. వారు రంగంలోకి దిగితే ప్రత్యర్థులు రాజకీయంగా కనుమరుగు అవుతారు అనేంత ప్రజాభిమానం కూడా వారికి లేదని.. ఇక కుట్రలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలకు ఉన్న రాజకీయ అభిమానాన్ని కొలవడానికి వేరే ప్రమాణాలు అవసరం లేదన్న కేవీపీ.. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసి ఓడిపోవటం. 2023 తెలంగాణ శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చాలన్నారు.యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నేతలపై అసభ్యకరంగా మాట్లాడినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్‌ను ప్యాకేజీ స్టార్, పెయిడ్ ఆర్టిస్ట్ అని విమర్శిస్తుంటే ఆయనెంత బాధపడతారో.. వైఎస్ఆర్ వంటి జనం మెచ్చిన నేతలపై అసత్య ఆరోపణలు చేస్తే ఆయన అభిమానులు కూడా అలాగే బాధపడతారనే సంగతి గుర్తుంచుకోవాలని లేఖలో కేవీపీ కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వారిలో కొంతమంది జనసేనలోనూ ఉన్నారని.. అనవసరంగా వైఎస్ఆర్‌ను నిందించి, వారి మనసులు గాయపరచవద్దని కోరారు. ఇవ్వకపోవటానికి ప్రభుత్వానికి కారణాలు ఉండొచ్చన్న కేవీపీ.. వాటిని తెలుసుకోకుండా వైఎస్ఆర్‌ను, కాంగ్రెస్ పార్టీని నిందించటం ప్రయోజనం లేదన్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడిగా ఎదగాలని అనుకుంటే తప్పేమీ లేదన్న కేవీపీ.. విభజన చట్టంలో తెలంగాణకు, ఆంధ్రకు ఇచ్చిన హామీలను సాధించడానికి కేంద్రంపై యుద్ధానికి కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని కోరారు. లేదంటే చంద్రబాబును ఒప్పించి.. లేదా వ్యక్తిగతంగా పోరాడి, ఆ హామీలను సాధించి ప్రజాభిమానాన్ని గెలుచుకోవాలని పవన్ కళ్యాణ్‌కు కేవీపీ రామచంద్రరావు సూచించారు. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..అయితే హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2005-06 సమయంలో బాలు సినిమా తర్వాత తాను అపెండిక్స్ ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వెళ్లాలని.. అప్పుడు ఓ పోలీసాఫీసర్ తనను కలిశారని పవన్ కళ్యాణ్ చెప్పారు. మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా, మీ అన్నయ్య రాజకీయాల్లోకి వస్తున్నారా అని ఆయన తనను అడిగారని.. తాను లేదని చెప్పినట్లు గుర్తు చేశారు. ఎందుకు అలా అడుగుతున్నారని తాను పోలీస్ అధికారిని అడిగితే.. మిమ్మల్ని బద్నాం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన చెప్పారని, అయితే తాను వాటిని నమ్మలేదన్నారు పవన్ కళ్యాణ్. కానీ రెండేళ్లకు అదే నిజమైందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.