కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌తో గవర్నర్ థావర్ చంద్ గహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు. బుధవారం సాయంత్రం బెంగళూరులోని లోక్‌భవన్‌లోని గ్లాస్‌హౌస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. డీకే ప్రమాణస్వీకార వేడుకు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కేరళ, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు వీడీ సతీశన్, రేవంత్ రెడ్డి, సుఖ్విందర్ సింగ్ సుఖు తదితరులు హాజరయ్యారు. రాజ్యాంగాన్ని చేతితో పట్టుకుని డీకే ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు వేదికపై నుంచి ప్రజలకు ఆయన సాష్టాంగ నమస్కారం చేయడం విశేషం.ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా జి.పరమేశ్వర ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా సిద్ధరామయ్య తనయుడు యత్రీంద్ర, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే,కేహెచ్‌ మునియప్ప, కె.జె.జార్జ్‌, ఎంబీ పాటిల్‌, సతీశ్‌ జర్కిహోళి, రామలింగారెడ్డి, కృష్ణబైరి గౌడ, మాజీ స్పీకర్ యు.టి.ఖాదిర్‌, ఈశ్వర్‌ ఖండ్రే, బైరతి సురేశ్‌, శరణ్‌ ప్రకాశ్‌ పాటిల్‌తో గవర్నర్ ప్రమాణం చేయించారు.