ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కుమార్తె వెన్నెల ఖండించారు. తెలంగాణ మా అయ్యల జాగీరేనని.. ఈ రోజు మాది, రేపు మా బిడ్డలదని స్పష్టం చేశారు. నటుడిగా, గద్దర్ అభిమానిగా పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ ప్రజలు గౌరవిస్తారని.. కానీ నిన్న చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. సినిమాలలో నటిస్తేనో, డబ్బులు పంచితేనో తెలంగాణ రాలేదన్న ఆమె.. ఎంతో మంది అమరుల త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. అందు. " అన్నా. నటుడిగా, గద్దర్ అభిమానిగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు.. తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖండిస్తున్నా. తెలంగాణ సినిమాలో నటిస్తే రాలేదు. పొత్తులకు పోతే తెలంగాణ రాలేదు. పైసలు పంచితేనో.. లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం. రక్తం చిందించిన ఎందరో బిడ్డల త్యాగాల పోరాటం. తెలంగాణది ఆత్మ గౌరవ పోరాటం. ఎవరినీ బాధపెట్టకుండా, హింసించకుండా తమను తాము ఆహుతి చేసుకున్న శ్రీకాంతాచారే సాక్ష్యం. తెలంగాణ పోరాటం సాంస్కృతిక యుద్ధం. పాటలు, మాటలతో గడప గడపకూ వెళ్లి.. ప్రజలను చైతన్యం చేసిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డది. ""మా భూములు మావి, మా నీళ్లు మావి.. మా పాలన మాది అనే నినాదంతో త్యాగాలు చేసి సాధించకున్న పోరాటగడ్డ తెలంగాణ. తెలంగాణ తొలిదశ పోరాటంలో 2 వేలమందికి పైగా అమరులయ్యారు. మలిదశ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు అమరులయ్యారు. ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయారు. ఎంతో మంది తల్లులు, ఆడబిడ్డలు తమ బిడ్డలను పోరాటాలకు పంపించిన చరిత్ర తెలంగాణది. మీరు అన్నట్లుగానే ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు. నిన్న మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా బిడ్డల జాగీరు.. ఇది మా గడ్డే, మా తెలంగాణ గడ్డే.. మా త్యాగాల గడ్డే.." అని నినదించారు గద్దర్ కుమార్తె వెన్నెల.మరోవైపు హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ప్రజా యుద్ధనౌక చేశారు. వెన్నులో బుల్లెట్లు దిగిన కారణంగా ప్రయాణాలు చేసేందుకు ఇబ్బందిగా ఉందని గద్దర్ తనతో చెప్తే.. కారు తీసిచ్చానని అన్నారు. ఈరోజు తనను విమర్శిస్తున్న వారు గద్దర్ బతికి ఉన్న సమయంలో ఏం చేశారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.