హైదరాబాద్ పర్యటనలో ఏపీ తెలుగు రాష్ట్రాలలో కాకరేపుతున్నాయి. తెలంగాణలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే స్పందించారు. ఇక ఏపీలోనూ వైసీపీ నేతలు రియాక్టవుతున్నారు. ముఖ్యంగా మాజీ సీఎంను వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి .. వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. అప్పుడేం జరిగిందో మర్చిపోయావా అంటూ సెటైర్లు వేశారు."నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదిరించా. రోడ్డు మీద బయటకు వస్తే కాల్చేసే రోజులవి. నేను నా తుపాకీని పోలీస్ స్టేషన్‌లో సరెండర్ చేశానంటూ పవన్ కళ్యాణ్ సొల్లు కబుర్లు చెప్తున్నారు. ఆ రోజు తుపాకీ ఇచ్చింది దేనికంటే.. మీ అమ్మాయి, మా బాబాయ్ పెద్ద రౌడీ, తుపాకీ ఉంది కాల్చేస్తాడంటూ తనకు ప్రాణ హాని ఉందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పుడు పోలీసులు మీకు ఫోన్ చేసి.. తుపాకీ ఉందని కాలిస్తే ముద్దాయి అవుతారు జాగ్రత్త అని హెచ్చరిస్తే, ఫోజుగా తుపాకీ తీసుకువచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పగించావు. ""రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్డు మీదకు వస్తే కాల్చిందెవరిని అంటే.. పసిపిల్లలను రేప్ చేసిన దుర్మార్గులను రోడ్డుపై కాల్చి చంపారు. ఎందుకు సొల్లు కబుర్లు చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు శాంతి భద్రతల సమస్య వస్తుందని మీ మీటింగ్ ఆపితే.. రేయ్ జగన్, నువ్వెవ్వడివి..అంబేద్కర్ నాకిచ్చిన హక్కు అంటూ ఎగిరావ్.. ఇప్పుడేమో అక్కడ రేవంత్ రెడ్డి అంటే నాకిష్టం, కేసీఆర్ అంటే మర్యాద అని మాట్లాడుతున్నావ్.. ఏం ఆస్తులు అక్కడ ఉన్నాయనా".. అంటూ పేర్ని నాని సైటెర్లు వేశారు. మరోవైపు ఆంధ్రాలో మీటింగ్ పెట్టలేని పవన్ కళ్యాణ్.. తెలంగాణలో మీటింగ్ పెడతారంటూ అంటూ పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ వైఖరి చూస్తుంటే తల్లికి కూడు పెట్టలేనోడు పినతల్లికి పట్టుచీర పెడతా అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పక్కన ఉండే కాపులు అందరూ నెమ్మదిగా జారిపోతున్నారని.. ఈ విషయాన్ని గమనించే పవన్ కళ్యాణ్ తెలంగాణలో కొత్త డ్రామా మొదలుపెట్టారన్నారు పేర్ని నాని. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా వాటాలు తీసుకోవటం ఆపేసి.. కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై, చంద్రబాబు, నారా లోకేష్ అవినీతిపై నిజాయితీగా ప్రశ్నించాలని పేర్ని నాని సూచించారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి గురించి ప్రశ్నించాలంటూ పేర్ని నాని పవన్ కళ్యాణ్‌కు సూచించారు.