Credit Card Changes: దిగ్గజ క్రెడిట్ కార్డు సంస్థల్లో ఒకటైన ఎస్బీఐ కార్డ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. తమ కొన్ని ఎంపిక చేసిన ఫోన్‌పే ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు సంబంధించి రివార్డ్ పాయింట్ ప్రోగ్రామ్‌లో సవరణలు చేసింది. ఈ కొత్త రూల్స్ 2026, జులై 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇది ఫోన్‌పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్, ఫోన్‌పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సెలక్ట్ బ్లాక్ కార్డ్ హోల్డర్స్‌కు వర్తిస్తుంది. రివార్డ్ పాయింట్స్ పొందేందుకు కొత్త పరిమితుల్ని విధించింది. ఇదే సమయంలో కొన్నింటిపై రివార్డ్ పాయింట్లు పొందకుండా కూడా మినాహాయించింది. చాలా వరకు ఫోన్‌పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్, ఫోన్‌పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సెలక్ట్ బ్లాక్ కార్డ్ హోల్డర్స్.. ఈ కార్డుల్ని ఎక్కువగా ఇన్సూరెన్స్, యుటిలిటీలు, ఎడ్యుకేషన్, జువెల్లరీ కొనుగోళ్లు, టోల్ పేమెంట్స్ కోసం వినియోగిస్తుంటారు. ఇప్పుడు ఈ పేమెంట్స్‌కు సంబంధించి రివార్డ్ పాయింట్ ప్రయోజనాల్లో మార్పులు రాబోతున్నాయి. జులై 1 నుంచి వీటి రివార్డ్ పాయింట్ ఎర్నింగ్స్‌లో నెలవారీ పరిమితుల్ని పరిచయం చేస్తోంది. రివార్డ్ పాయింట్ ప్రయోజనాల్లో కోత..అంతకుముందు ఫోన్‌పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్ కార్డ్ హోల్డర్లు.. ఫోన్‌పే స్పెండింగ్స్‌పై నెలకు 1000 రివార్డ్ పాయింట్ల వరకు పొందేవారు. ఇంకా ఆన్‌లైన్ స్పెండింగ్స్‌పైనా 1000 వరకు రివార్డ్ పాయింట్లు వచ్చేవి. ఇప్పుడు మాత్రం ఈ స్ట్రక్చర్ మారిపోయింది. దీనిని రెండు భాగాలుగా విభజించింది ఎస్బీఐ కార్డ్. ఫోన్‌పే స్పెండింగ్స్‌లోనే ఇన్సూరెన్స్ రిలేటెడ్ స్పెండింగ్స్‌పై గరిష్ఠంగా 250 వరకు రివార్డ్ పాయింట్లు, ఇతర ఫోన్‌పే ట్రాన్సాక్షన్లపై 750 పాయింట్ల వరకు పొందేలా పరిమితులు విధించింది. ఇక.. ఆన్‌లైన్ స్పెండింగ్స్‌కు సంబంధించి.. మంత్లీ రివార్డ్ పాయింట్స్ పరిమితిని 1000 నుంచి 750 పాయింట్ల వరకు తగ్గించింది. ఇక్కడ ప్రయోజనాలు కోల్పోతారన్నమాట. ఇక్కడ పరిమితులకు మించి ఖర్చు చేసినా.. ఆ పరిమితిలోపు మాత్రమే రివార్డ్ పాయింట్లను పొందుతారన్నమాట. >> మరోవైపు ఫోన్‌పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సెలక్ట్ బ్లాక్ కార్డ్ హోల్డర్లకు కూడా కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఇక్కడ ఫోన్‌పే స్పెండింగ్స్‌పై నెలకు అంతకుముందు గరిష్ఠంగా 2 వేల వరకు రివార్డ్ పాయింట్లు పొందేలా ఉండగా.. ఇప్పుడు దీనిని రెండు భాగాలుగా విభజించింది. ఇన్సూరెన్స్ స్పెండింగ్స్‌పై గరిష్ఠ పరిమితి 500 పాయింట్లు, ఇతర స్పెండింగ్స్ గరిష్ఠ పరిమితి 1500 రివార్డ్ పాయింట్లుగా నిర్ణయించింది. ఇతర ఆన్‌లైన్ స్పెండింగ్స్ విషయానికి వస్తే రివార్డ్ పాయింట్ల పరిమితిని 2000 నుంచి సగానికి తగ్గించి 1000 పాయింట్లకు చేర్చింది. వీటిపై నో రివార్డ్ పాయింట్స్..ఇదే సమయంలో కొన్ని కేటగిరీలపై రివార్డ్ పాయింట్స్ పొందడాన్ని ఇప్పుడు తీసేసింది. అంటే కొన్ని స్పెండింగ్స్‌పై ఇప్పుడు రివార్డ్ పాయింట్లు పొందలేరు. అవేంటో చూద్దాం. టోల్ అండ్ బ్రిడ్జ్ పేమెంట్స్గిఫ్ట్స్ అండ్ సావనీర్ కొనుగోళ్లుజువెల్లరీ కొనుగోళ్లుఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు పేమెంట్స్ఫోన్‌పే యాప్ కాకుండా బయట చేసే యుటిలిటీ పేమెంట్స్ఫోన్‌పే యాప్ వెలుపల చేసే ఇన్సూరెన్స్ పేమెంట్స్ఫోన్‌పే యాప్ బయట చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్