తెలంగాణలో రేపటి నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు.. ఆ ప్రాంతాల్లోనే అధికం..

Wait 5 sec.

రేపటి నుంచి (జూన్ 5 శుక్రవారం) పెరగనుంది. ఈ విషయాన్ని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి తెలిపారు. ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని పొంగులేటి వెల్లడించారు. ప్రాంతాన్ని అనుసరించి భూముల మార్కెట్ ధరలు 50 శాతం నుంచి 100 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని మంత్రి వివరించారు. సచివాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. దీనికి సంబంధించి వివరాలను పంచుకున్నారు. ప్రధాన ఏరియాలలోనివంద శాతం పెరుగుతాయని అన్నారు. భూముల మార్కెట్ విలువ పెంపు ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి 12 వందల కోట్ల నుంచి రూ.1400 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంచనా వేశారు.మరోవైపు శేరిలింగంపల్లి, ఖాజాగూడ, రాజేంద్ర నగర్ వంటి ప్రాంతాలలో అధిక పెంపు ఉంటుందని మంత్రి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఉండదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అలాగే ఆ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచబోమని స్పష్టం చేశారు. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ల అధికారాలు చాలా వరకూ తగ్గించామని మంత్రి వెల్లడించారు. వారికి పరిమితస్థాయిలో అధికారాలు మాత్రమే ఉంటాయన్నారు. భూముల మార్కెట్ విలువ పెంపు కారణంగా భూసేకరణ సమయంలో ప్రభుత్వానికి కొంతమేరకు నష్టం జరిగినా.. రైతులకు ఉపయోగం ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఏవైనా సమస్యలు ఉంటే ప్రజల ఫిర్యాదుల స్వీకరణ కోసం హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే తహశీల్దార్ల బదిలీలు ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు ఫ్యూచర్ సిటీని రద్దు చేసేందుకు అవకాశం లేదని మంత్రి పొంగులేటిశ్రీనివాసరెడ్డి స్పష్టం చశారు. ఇప్పటి వరకూ తెలంగాణలో ఇందిరళ్ల ఇళ్ల పథకానికి 7000 కోట్లు చెల్లించినట్లు వివరించారు. అసైన్డ్ భూములకు సంబంధించి పాలసీ తెస్తామన్న మంత్రి.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసైన్డ్ భూములకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిషేధిత జాబితాలో చేర్చిందని వివరించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి మంచి జరిగే ఏ పనికైనా తాను వెనుకాడనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.