: మనలో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎక్కువగా దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ కోసం మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగా లాంగ్ రన్‌లో సంపద పెరుగుతూనే ఉంటుంది. స్వల్ప కాలంలో ఈ బెనిఫిట్ ఎక్కువగా ఉపయోగపడదు. ఇంకా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో చాలా మంది సిప్ రూపంల ోఇన్వెస్ట్ చేసేందుకు చూస్తుంటారని చెప్పొచ్చు. నెలకు చిన్న మొత్తాల్లోనూ పెట్టుబడి పెట్టొచ్చు. ఇక గత ఐదేళ్ల కాలంలో సిప్ పెట్టుబడులపై ప్రతి స్కీమ్ కూడా పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం విశేషం. ఈ ఐదేళ్ల కాలంలో ఇండస్ట్రీలో ఐదేళ్ల కాలం పూర్తి చేసుకున్న ఈక్విటీ ఫండ్స్ 216 కాగా.. ఇందులో 122 స్కీమ్స్ డబుల్ డిజిట్ XIRR రాబడుల్ని అందించగా.. రెండు చూస్తే వార్షికంగా సగటున 20 శాతం XIRR కు మించి రిటర్న్స్ ఇచ్చాయి.HSBC మిడ్ క్యాప్ ఫండ్ సిప్ పెట్టుబడులపై ఐదేళ్లలో అధిక రిటర్న్స్ ఇచ్చింది. సగటున వార్షికంగా 20.48 శాతం రాబడి అందించగా.. ఇక్కడ నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టిన వారికి ఐదేళ్లలో రూ .10 లక్షల వరకు వచ్చింది. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ 20.27 శాతం రిటర్న్స్ ఇవ్వగా ఇక్కడ రూ. 10 వేల సిప్‌పై రూ. 9.78 లక్షలు వచ్చాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మిడ్ క్యాప్ ఫండ్ 19.26 శాతం రిటర్న్స్ ఇవ్వగా ఇక్కడ నెలకు రూ. 10 వేల సిప్‌పై రూ. 9.50 లక్షలకుపైనే వచ్చింది. తర్వాత వరుసగా మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ వంటివి ఉన్నాయి. నిప్పన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్, ఎడెల్‌వీజ్ మిడ్ క్యాప్ ఫండ్ వరుసగా 18.28, 18.26 శాతం చొప్పున రిటర్న్స్ అందించాయి.ఇక నిర్వహణలోని ఆస్తుల విలువ పరంగా అతిపెద్ద మిడ్ క్యాప్ ఫండ్ హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్ ఐదేళ్ల కాలంలో సగటున వార్షిక ప్రాతిపదికన 17.84 శాతం XIRR రాబడి అందించగా.. రూ. 10 వేల సిప్‌ను ఐదేళ్లలో రూ. 9.23 లక్షలుగా మలిచింది. అతిపెద్ద స్మాల్ క్యాప్ ఫండ్.. నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ రూ. 10 వేల సిప్‌ను ఐదేళ్లలో రూ. 8.83 లక్షలుగా మలిచింది. ఇక ఎస్బీఐ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్.. 14.09 శాతం రిటర్న్స్ అందించింది. ఇక్కడ కూడా రూ. 10 వేల సిప్‌పై రూ. 8.50 లక్షలకుపైనే అందింది. Disclaimer: పైన ఇచ్చింది సమాచారం మాత్రమే.. పెట్టుబడికి సిఫార్సు కాదు. మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.