కేటాయింపుపై కూటమి పార్టీల మధ్య క్లారిటీ వచ్చింది. ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలలో టీడీపీ 3, జనసేన పార్టీ 1 సీటు తీసుకోనున్నాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. గురువారం రోజున ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ నేతల భేటీ జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌తో పాటుగా జనసేన నేత నాదెండ్ల మనోహర్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో రాజ్యసభ సీట్ల కేటాయింపుతో పాటుగా కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తి కావొస్తున్న సందర్భంపై చర్చించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో టీడీపీ 3, జనసేన 1 సీటు తీసుకోనున్నట్లు కూటమి పార్టీలు ప్రకటించాయి. దీంతో ఈసారికి బీజేపీకి రాజ్యసభ సీటు లేదని క్లారిటీ వచ్చింది.మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ నుంచి పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరితో పాటుగా టీడీపీ ఎంపీ సానా సతీష్ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికల కోసం చేసింది. దీంతో ఎన్డీఏ కూటమి నేతలు భేటీయై ఎవరెన్ని సీట్లు తీసుకోవాలనే దానిపై చర్చించారు. గతంలో బీజేపీకి రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించిన నేపథ్యంలో.. పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడి దృష్ట్యా ఈసారి అవకాశం అడగొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే బీజేపీని కోరినట్లు సమాచారం. బీజేపీ నుంచి ఆర్. కృష్ణయ్య, పాకా సత్యనారాయణకు గతంలో అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈసారికి బీజేపీకి అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేల సంఖ్యా బలంగా ఆధారంగా నాలుగు రాజ్యసభ స్థానాలు కూటమి పార్టీలు హస్తగతం చేసుకోనున్నాయి. ఈ నాలుగింటిలో మూడు టీడీపీ, ఒకటి జనసేన ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఇక భారీ సంఖ్యలో ఉన్నారు. టీడీపీ విషయానికి వస్తే దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, సానా సతీష్ బాబు వంటి నేతలు రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్నారు. జనసేనలో లింగమనేని రమేష్, బండారు నరసింహారావు వంటి నేతలు రాజ్యసభ బెర్తు కోరుకుంటున్నారు. అయితే రాజ్యసభ అభ్యర్థులు ఎవరనే దానిపై టీడీపీ, జనసేన పార్టీలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నాయి.