మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో వికెట్లు ఫటాఫట్ అని పడిపోయాయి. గతంలో ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఒకే రోజు 20 వికెట్లు పడగా.. ఇప్పుడు ఈ టెస్టులో 16 వికెట్లు డౌన్ అయ్యాయి. ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ పది వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ పరిస్థితి కూడా అంతే అనుకునే సమయంలో ఫ్లయింగ్ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్ కివీస్‌ను ఆదుకున్నాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జాక్ క్రాలీ విఫలమవుతుండటంతో ఈ టెస్టుతో ఎంట్రీ ఇచ్చిన ఎమీలియో గే 8 పరుగులు చేసి జట్టు స్కోర్ 16 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఇన్నింగ్స్‌ నిదానంగా సాగుతుంది అనుకున్న సమయంలో బెన్ డకౌట్ అవుటవ్వడంతో ఇంగ్లండ్ మిడిలార్డర్‌ను కుప్పకూల్చింది.జట్టు స్కోర్ 31 పరుగుల వద్ద బెన్ డకెట్ అవుటవ్వగా.. ఆ వెంటనే జేకబ్ బెతెల్, జో రూట్ వికెట్లు కోల్పోయారు. దాంతో ఇంగ్లండ్ జట్టు 34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జెమీ స్మిత్ కూడా కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్ బాట పట్టాడు. దాంతో 55 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన జట్టును హ్యారీ బ్రూక్ నిలబెట్టాడు. వరుస వికెట్లు పడుతున్నప్పటికీ హ్యారీ బ్రూక్ ఏ మాత్రం తగ్గకుండా బౌండరీలు బాదుతూనే ఉన్నాడు. 71 బంతులు ఆడిన బ్రూక్ 10 ఫోర్లతో 56 పరుగులు చేసి అవుటయ్యాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ క్యాచ్‌ని కేన్ విలియమ్సన్ అద్భుతంగా అందుకుని పెవిలియన్‌కు పంపించాడు. ఆఖర్లో జోష్ టంగ్ - షోయబ్ బషీర్ 22 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 140 పరుగులకు ఆలౌట్ అయింది. కైల్ జేమీసన్ 5 వికెట్లు తీయగా, నాథన్ స్మిత్ 3, విలియమ్ ఓరూర్క్ 2 వికెట్లు పడగొట్టాడు.తొలి రోజు 40 ఓవర్ల తర్వాతే మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు రెండో ఓవర్‌లోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఒల్లీ రాబిన్సన్ వేసిన రెండో ఓవర్‌లో డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర అవుటయ్యారు. దాంతో కివీస్ రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ టామ్ లాథమ్ (3), డారెల్ మిచెల్ (12), టామ్ బ్లడెల్ (4) పరుగులకే పెవిలియన్ బాట పట్టడంతో 29 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ 50 పరుగులకే ఆలౌట్ అవుతుంది అనుకున్న సమయంలో గ్లెన్ ఫిలిప్స్ వికెట్లు ప్రవాహానికి అడ్డుగా ఓ గోడగా నిలిచాడు. ఆఖరి సెషన్‌లో ఆరు వికెట్ల తర్వాత మరో వికెట్ పడకుండా ఫిలిప్స్ చాలా జాగ్రత్తగా ఆడాడు. ఫిలిప్స్ - స్మిత్ కలిసి 38 బంతుల్లో 32 పరుగులు జోడించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 61/6 పరుగులు చేసింది. ఫిలిప్స్ 34 బంతుల్లో 6 ఫోర్లతో 31, నాథన్ స్మిత్ 10 బంతుల్లో 6 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నారు. ఓలీ రాబిన్సన్ 4, గస్ అట్కిన్సన్ 1, జోష్ టంగ్ 1 వికెట్ పడొట్టారు.