Multibagger: స్మాల్ క్యాప్ కేటగిరిలోని అగ్రి టెక్ సెక్టార్ కంపెనీ ఏవీఐ పాలిమర్స్ లిమిటెడ్ () బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ తమ షేర్ హోల్డర్లకు డబుల్ ధమాఖా ఆఫర్ తీసుకొచ్చింది. జూన్ 4వ తేదీన జరిగిన కంపెనీ బోర్డు సమావేశంలో 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్, 1:10 రేషియోలో బోనస్ షేర్స్ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ రెండు కార్పొరేట్ బెనిఫిట్స్‌కి అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు డేట్ త్వరలోనే నిర్ణయించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్టాక్ స్ప్లిట్, బోనస్ ఇష్యూ ప్రకారం మరోవైపు ఈ కంపెనీ షేరు గత ఏడాదిలో 182 శాతం లాభాన్ని తమ వాటాదారులకి అందించింది. మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది. ఏవీఐ పాలిమర్స్ లిమిటెడ్ అనేది రూ.100 లోపు ధర గల ఒక పెన్నీ స్టాక్.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. కంపెనీ బోర్డు అఫ్ డైరెక్టర్స్ జూన్ 4వ తేదీ గురువారం రోజున సమావేశమై 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టాలని నిర్ణయించారు. దీని అర్థం రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉన్న 10 ఈక్విటీ షేర్లుగా విభజిస్తారు. దీని ప్రకారం ఈ కంపెనీకి చెందిన 100 షేర్స్ ఉంటే అవి 1000 షేర్లుగా మారతాయి. ఇదే సమావేశంలో . దీని అర్థం రికార్డు డేట్ నాటికి రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండే 10 ఈక్విటీ షేర్స్ కొనుగోలు చేసి తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉన్నవారికి అదనంగా రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండే 1 ఈక్విటీ షేరుని ఉచితంగా బోనస్ రూపంలో జారీ చేస్తారు. దీని ప్రకారం మీ వద్ద ఉన్న 1000 షేర్లకు అదనంగా మరో 100 షేర్లు బోనస్ గా లభిస్తాయి. అప్పుడు మీ ఖాతాలో 1100 షేర్స్ ఉంటాయి. చివరి ట్రేడింగ్ సెషన్లో AVI పాలిమర్స్ లిమిటెడ్ షేరు 5 శాతం లాభంతో రూ. 17.59 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 29.41 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 5.43 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 16 శాతం లాభాన్ని ఇచ్చింది. గత నెల రోజుల్లో 20 శాతం నష్టపోయింది. గత ఆరు నెలల్లో 56 శాతం లాభాన్ని అందించింది. గత ఏడాది కాలంలో 182 శాతం లాభాన్ని ఇచ్చింది. ఏడాది క్రితం లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొనుగోలు చేసినట్లయితే ఇప్పుడు ఆ విలువ రూ.2.82 లక్షలు అవుతుంది. గత ఐదేళ్ల కాలంలో 105 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 166 కోట్లుగా ఉంది.