కాకినాడ జ్ఞానేశ్వరి కేసు: పెంపుడు కుక్కకు పోస్టుమార్టం పూర్తి.. రిపోర్టుపై సర్వత్రా ఆసక్తి.. కొత్త అనుమానాలు!

Wait 5 sec.

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో మిస్టరీ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక ఆధారంగా ఉన్న పెంపుడు కుక్క శనివారం చనిపోయింది. రెండు రోజులు వింతగా ప్రవర్తించిన కోల్పోయింది. ఈ పెంపుడు కుక్కకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. ఎన్. సూరవరం వెటర్నరీ సిబ్బంది పెంపుడు శునకానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఈ నమూనాలను విశాఖపట్నంలోని ఓ ఫోరెన్సిక్ ‌ల్యాబ్‌కు పంపించారు. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం నివేదికలో ఏముంటుందనేదీ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. పెంపుడు కుక్కది సహజ మరణమా.. లేక విష ప్రయోగమా అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో వెల్లడి కానుంది. దీంతో నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో గాలింపు చర్యలుమరోవైపు చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై తొమ్మిది రోజులు కావటంతో పాప ఆచూకీపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు రంగంలోకి దిగి.. గాలింపు చర్యలు చేపట్టాయి. జ్ఞానేశ్వరి ఇంటి సమీపంలోని పామాయిల్ తోట, స్థానికంగా ఉన్న నల్లకొండ మీద గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. జ్ఞానేశ్వరి తమ ఇంటికి దగ్గర్లోనే ఆడుకునేదని.. 20 మీటర్ల దూరం కూడా వెళ్లేది కాదని గణేష్ చెప్తున్నారు. ఒంటరిగా దూరం వెళ్లే అలవాటు జ్ఞానేశ్వరికి లేదంటున్నారు. ఈ క్రమంలోనే గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారంటూ అనుమానాలు వ్యక్తం చేయటం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక జ్ఞానేశ్వరి వెంట పెంపుడు కుక్క ఎప్పుడూ ఉంటుందని.. కుక్కతో కలిసి ఆడుకోవటం పాపకు అలవాటని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పెంపుడు కుక్క చనిపోవటంతో పోలీసులు కీలక ఆధారాన్ని కోల్పోయారు. మరోవైపు పాపారావు అనే వ్యక్తి జ్ఞానేశ్వరిని తోట బయట చూశానని చెప్పటాన్ని చిన్నారి కుటుంబసభ్యులు ఖండించారు. పాప ఒంటరిగా తోటను దాటి వెళ్లేందుకు అవకాశం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఇక చిన్నారి క్షేమంగా రావాలని కుటుంబ సభ్యులతో పాటుగా స్థానికులు ప్రార్థిస్తున్నారు.