'డాడ్ డైరీస్'.. ప్రెగ్నెన్సీ నుంచి 6 నెలల పాపకే రూ.4 లక్షలు.. పిల్లల్ని కనేంత ఆర్థిక స్తోమత మీకు ఉందా?!

Wait 5 sec.

Dad Diaries: నేటి కాలంలో ఇల్లు గడవడం ఒక ఎత్తైతే, పిల్లలను కనడం, వారిని పెంచి పెద్ద చేయడం ఆర్థికంగా ఒక పెద్ద సవాలుగా మారింది. 'ఈ రోజుల్లో మెట్రో నగరాల్లో పిల్లలను కనడం ఖర్చుతో కూడుకున్న పని అని మీరు అనుకుంటే, అసలు నంబర్లు వింటే షాక్ అవుతారు' అంటూ అయాన్ చక్రవర్తి అనే వ్యక్తి పంచుకున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నగరంలో పేరెంట్ హుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఎదురయ్యే ఆర్థిక వాస్తవాలను లెక్కలతో సహా వివరించారు.అయాన్ చక్రవర్తి డాడ్ డైరీస్గుర్గావ్‌కు చెందిన మేనేజ్మెంట్ కన్సల్టెంట్, డిజిటల్ క్రియేటర్ అయిన అయాన్ చక్రవర్తి తన భార్య గర్భవతి అయినప్పటి నుంచి పాప పుట్టిన 6 నెలల వరకు అయిన ఖర్చు రూ.4 లక్షలుగా పేర్కొన్నారు. డాడ్ డైరీస్ అనే సిరీస్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మెడికల్ కన్సల్టేషన్, డయాగ్నేస్టిక్ టెస్టులు, మెడిసన్స్, డెలివరీ ఖర్చులు, వ్యాక్సిన్లు, బెబీ వస్తువులు, డైపర్లు, ఫార్ములా మిల్క్, బొమ్మలు సహా అన్నింటికి తాను ఖర్చు చేసినట్లు చెప్పారు. 'ఈ రోజుల్లో మెట్రో నగరంలో పిల్లల్ని కనడం ఖర్చుతో కూడుకున్నదని మీరు అనుకుంటుంటే, అసలు ఖర్చులు వింటే మీరు షాక్ అవుతారు. డాడ్ డైరీస్ మొదటి ఎపిసోడ్‌కు స్వాగతం. ఇందులో నేను కొత్తగా తల్లిదండ్రులైన వారికి లేదా త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న వారికి ఆధునిక పేరెంట్‌హుడ్ యొక్క వాస్తవ స్వరూపాన్ని చూపించడంలో సహాయం చేస్తాను.' అంటూ అయాన్ చక్రవర్తి చెప్పుకొచ్చారు. డెలివరీకి ముందే మొదలయ్యే ఖర్చులుఅయాన్ చక్రవర్తి ప్రకారం భార్య ప్రెగ్నెంట్ అని తెలిసిన మొదటి రోజు నుంచే ఖర్చులు వేగంగా మొదలవుతాయి. రెగ్యులర్ డాక్టర్ కన్సల్టేషన్లు, వివిధ రకాల స్కానింగ్‌లు, బ్లడ్ టెస్టులు, మందుల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో కేవలం మెడిసిన్స్, సప్లిమెంట్ల కోసమే నెలకు రూ.1500 నుంచి రూ.2000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రసవం కోసం హాస్పిటల్‌ ఖర్చు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు అవుతుంది. ఒకేసారి పెట్టే ఖర్చులుపాప పుట్టిన మొదటి కొన్ని నెలల్లోనే ఇంట్లోకి కొన్ని రకాల వస్తువులను ఒకేసారి కొనుగోల చేయాల్సి వస్తుంది. ఇవి బడ్జెట్ పై అదనపు భారాన్ని పెంచాయి. బేబీ ఉయ్యాల, మంచం కోసం రూ.9 వేల నుంచి రూ.15 వేలు అుతుంది. బేబీ బట్టలు రూ.7 వేల నుంచి రూ.8 వేలు అవుతుంది. ఫీడింగ్ బాటిల్స్, స్టెరిలైజర్స్, ఇతర వస్తువుల ఖర్చు రూ.10 వేల వరకు ఉంటుంది. ప్రతి నెలా ఉండే ఖర్చులు ఒత్తిడిని పెంచుతాయి. అయాన్ చక్రవర్తి తన అనుభవంతో పంచుకున్న నెలవారీ అంచనాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రతి విజిట్‌కు డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు సుమారు రూ.1200, ఆరు నెలల కాలంలో అతిపెద్ద ఖర్చులలో వ్యాక్సిన్లు ఒకటిగా నిలిచాయి. డైపర్స్ కోసం నెలకు రూ.3000 నుంచి రూ.4000 అవుతుంది. ఫార్ములా మిల్క్ కోసం నెలకు రూ.4 వేలు, బొమ్మలు, ఇతర వస్తువుల కోసం రూ.2500 అవుతుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి పాపకు 6 నెలలు వచ్చే సరికి ఈ ఖర్చులన్నీ కలిసి మొత్తంగా దాదాపు రూ.4 లక్షల మార్క్ తాకింది.మెట్రో నగరాల్లో కేర్ టేకర్, నాన్సీల భారంమెట్రో నగరాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసేటప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్య చైల్డ్ కేర్. నమ్మకమైన లాయల్ నానీ దొరకడం గుర్గావ్ లాంటి నగరాల్లో చాలా కష్టమని, ఒక వేళ 24 గంటలు ఉండే ఆయాను పెట్టుకోవాలంటే అయ్యే ఖర్చు ఐటీ రంగంలో వచ్చే ఒక ఎంట్రీ లెవల్ ఉద్యోగి జీతం కంటే ఎక్కువ ఉంటుందని అయాన్ ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా ఒక మంచి డేకేర్ లేదా నానీ కోసం నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేలు అంతకంటే ఎక్కువ ఖర్చవుతుంది. నెటిజన్ల భిన్నాభిప్రాయాలుఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియా వినియోగదారుల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. ఇది నూటికి నూర శాతం నిజం. మెట్రో నగరాల్లో ఇద్దరు సంపాదిస్తేనే కానీ పిల్లలను పెంచడం సాధ్యం కావడం లేదు అంటూ కొందరు రాసుకొచ్చారు. మరికొందరు ఈ లెక్కలను తప్పుపట్టారు. ప్రభుత్వం ఆసుపత్రులలో ఉచితంగా వ్యాక్సిన్లు ఇప్పిస్తే ఈ ఖర్చు చాలా తగ్గుతుంది. అలాగే రూ.15 వేలు పెట్టి కాస్ట్లీ క్రిబ్స్ కొనాల్సిన అవసరం లేదు, పిల్లలు వాటిని త్వరగా దాటేస్తారు అని మరికొందరు పేర్కొన్నారు.