RSS మీటింగ్‌కి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లు.. కేరళ సీఎం సీరియస్, క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్

Wait 5 sec.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేరళలోని ఓ భారీ సమావేశం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్, సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా వచ్చిన ఈ కార్యక్రమానికి ముగ్గురు వైస్ ఛాన్సలర్లు హాజరయ్యారు. యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లు అయ్యుండి ఇలా ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరుకావడంపై ముఖ్యంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. ఇది చాలా పెద్ద తప్పిందగా పేర్కొంటూ.. ఆ వైస్ ఛాన్సలర్లు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైస్ ఛాన్సలర్ పదవికి కేరళ ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారని.. అలాంటి మతవాదాన్ని ప్రోత్సహించే నాయకుడి మీటింగ్‌కి హాజరై ఆ గౌరవాన్ని దెబ్బతీశారంటూ సీఎం ఆరోపించారు.తిరువనంతపురంలో జరిగిన ఆర్ఎస్ఎస్ శతజయంతి కార్యక్రమానికి హాజరైన ముగ్గురు వీసీల వివరాలు ఇవే. కేరళ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వీసీ మోహనన్ కున్నుమ్మల్, మహాత్మా గాంధీ యూనివర్శిటీ ఇన్‌చార్జ్ వీసీ మావూతు డి, మలయాళం యూనివర్శిటీ ఇన్‌చార్జ్ వీసీ సీఆర్ ప్రసాద్. ఈ ముగ్గురుపై కేరళ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది."మోహన్ భగవత్ ప్రసంగించిన ఆర్ఎస్ఎస్ శత జయంతి కార్యక్రమంలో ముగ్గురు వైస్ ఛాన్సర్లరు పాల్గొనడాన్ని చాలా పెద్ద తప్పుగా పరిగణిస్తున్నాం. ఇది తీవ్రమైన తప్పిదం. వారి చర్య కేరళ విద్యా సంప్రదాయాలకు, వారు నిర్వహిస్తున్న పదవులకు విరుద్ధంగా ఉంది. మతవాదాన్ని ప్రోత్సహించే చర్యలను కేరళ ప్రజలు అంగీకరిచరు. ఆ కార్యక్రమానికి హాజరైన ముగ్గురు వీసీలు తక్షణమే క్షమాపణ చెప్పాలి" అంటూ సీఎం వీడీ సతీశన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.కేరళ ప్రతిపక్ష నేత పినరయ్ విజయన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. కేరళలోని విశ్వవిద్యాలయాలపూ సంఘ్ పరివార్ అజెండాను రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చల మధ్య వీసీల హాజరు యూనివర్శిటీపై ఆర్ఎస్ఎస్ నియంత్రణ సాధించే ప్రయత్నాలకు ఉదాహరణగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కేరళ అధికార, ప్రతిపక్షాలపై బీజేపీ ఎదురుదాడి చేసింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. సెక్యులరిజం, రాజ్యాంగ విలువలపై ఇతరులకు బోధించే నైతిక హక్కు సీఎంకు లేదని విమర్శించారు. మోహన్ భగవత్ పాల్గొన్న కార్యక్రమానికి హాజరైన వీసీలను బెదిరించడం సమంజసం కాదని పేర్కొన్నారు.