Vedanta Aluminium Metal Ltd Share Price: దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. యూఎస్- ఇరాన్ శాంతి ఒప్పందం కుదరగా.. సెన్సెక్స్ ఇవాళ (జూన్ 15) 1100 పాయింట్లకుపైగా పెరిగింది. నిఫ్టీ 350 పాయింట్లు దూసుకెళ్లింది. ఇక్కడ పలు హెవీ వెయిట్ స్టాక్స్ రాణిస్తున్నాయి. చాలా స్టాక్స్ 3-5 శాతం వరకు పెరగడం విశేషం. అయితే ఇక్కడ దిగ్గజ పారిశ్రామిక వేత్త అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంతా లిమిటెడ్ స్టాక్స్ కోసం ఇన్వెస్టర్లు సెర్చ్ చేస్తుంటే షాకింగ్ స్టాట్స్ కనిపించాయి. వేదాంతా పేరిట ఇన్ని రోజులు ఒకే స్టాక్ ఉండగా.. ఇప్పుడు 5 కనిపిస్తున్నాయి. ఇంకా పలు బ్రోకరేజీ యాప్స్‌, వెబ్‌సైట్లలో ఆయా స్టాక్స్ కొన్ని 70-80 శాతం వరకు పతనమైనట్లు కనిపిస్తుంటే.. ఒక స్టాక్ 300 శాతానికిపైగా పెరిగినట్లు చూయిస్తోంది. దీంతో అసలేం జరిగిందని ఇన్వెస్టర్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. వేదాంతా లిమిటెడ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని 5 ప్రత్యేక సంస్థలుగా విభజించిన సంగతి తెలిసిందే. మే 1 నుంచే ఈ విభజన ప్రక్రియ (డీమెర్జర్) అమల్లోకి వచ్చింది. ప్రాథమిక లోహాల వ్యాపారం వేదాంతా లిమిటెడ్ పేరిట ఉండగా.. వేదాంతా అల్యూమినియం మెటల్ లిమిటెడ్ (VAML), వేదాంతా పవర్ లిమిటెడ్ (VEDPOWER), వేదాంతా ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ (VISL), వేదాంతా ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్ (VOGL) ఇలా వేర్వేరు కంపెనీలుగా మారాయి. ఇక్కడ కేటాయించారు. కంపెనీల విలువకు తగ్గట్లుగా షేరు విలువ ఉంటుంది. ఇప్పుడు జూన్ 15 సెషన్‌లో మిగతా 4 కంపెనీల షేర్లు లిస్టింగ్ అయ్యాయన్నమాట. అంటే వేదాంతా లిమిటెడ్ కంపెనీలో షేర్లు ఉన్నవారికి.. ఇప్పుడు వేదాంతా నుంచి 5 కంపెనీల్లో షేర్లు వస్తాయి. అంటే మీకు వేదాంతా లిమిటెడ్‌లో 100 షేర్లు ఉంటే.. మిగతా 4 కంపెనీల్లో కూడా 100 షేర్ల చొప్పున డీమ్యాట్ ఖాతాలో జమవుతాయి. ఇక్కడ షేరు ధర కూడా దానికి అనుగుణంగా విభజిస్తారన్న సంగతి మర్చిపోవద్దు. ఇప్పటికే డీమెర్జర్ నేపథ్యంలో . ఇక్కడ ధర సర్దుబాటు అయిందని చెప్పొచ్చు. రూ. 773.60- 289.50= 484.10 ధరలో మిగతా 4 స్టాక్స్‌ లిస్టింగ్ కావాల్సి ఉంది. ఈ లెక్కన ఒక్కో దానికి రూ. 121.03 లెక్కన ధరగా విభజించారు. కాబట్టి ఈ రూ. 120.02 ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్‌గా నిర్ణయించి.. ఇవాళ లిస్టయిన కంపెనీల షేర్లు ఎంత పెరిగాయి.. ఎంత పతనం అయ్యాయనేది చూయిస్తున్నాయి. కానీ కంగారు పడాల్సిందేమీ లేదు. ఆయా కంపెనీల విలువకు తగ్గట్లుగా లిస్టింగ్ అయ్యాయి. ఇక్కడ వేదాంతా అల్యూమినియం స్టాక్ NSE లో రూ. 522 వద్ద లిస్టయింది. దీంతో ముందటి క్లోజింగ్ ప్రైస్ రూ. 121.03 తో చూస్తే 300 శాతానికిపైగా పెరిగినట్లు చూయిస్తోంది. లిస్టింగ్ తర్వాత ఈ స్టాక్ ధర 5 శాతం లోయర్ సర్క్యూట్ కొట్టి రూ. 495.90 వద్ద ఉంది. వేదాంతా ఐరన్ ఐరన్ అండ్ స్టీల్ స్టాక్ రూ. 20 వద్ద ఓపెన్ కాగా.. దాదాపు 80 శాతానికిపైగా పడిపోయినట్లు చూయిస్తోంది. లిస్టింగ్ తర్వాత ఇది 5 శాతం పెరిగింది. వేదాంతా ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్ రూ. 38 వద్ద ఓపెన్ అయింది. ఇది కూడా 70 శాతం నష్టంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది లిస్టింగ్ తర్వాత 5 శాతం లోయర్ సర్క్యూట్ కొట్టింది. వేదాంతా పవర్ షేరు రూ. 41.80 వద్ద ఓపెన్ అయింది. ఇది కూడా దాదాపు 65 శాతానికిపైగా పడిపోయినట్లు చూయిస్తోంది. ఏప్రిల్ 30నే లిస్టయిన వేదాంతా లిమిటెడ్ స్టాక్ ఒక శాతం నష్టంతో రూ. 305 వద్ద ట్రేడవుతోంది.ఇక్కడ ఈ స్టాక్స్ అన్నింటి ధర కలిపి చూస్తే వీటి ధర సుమారు రూ. 980 స్థాయిలో ఉంది. అంటే డీమెర్జర్‌కు ముందు వేదాంతా లిమిటెడ్ షేరు రూ. 773 స్థాయిలో ఉండగా.. దాదాపు 25 శాతం ప్రీమియంతోనే నమోదయ్యాయని చెప్పొచ్చు. దీంతో మార్కెట్ విలువ పెరగ్గా.. ఇన్వెస్టర్ల సంపద కూడా దానికి అనుగుణంగానే పెరిగింది.Disclaimer: పైన ఇచ్చింది సమాచారం మాత్రమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు తీసుకోవడం మంచిది.