ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు విషెస్ తెలిపారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు జగన్ తెలిపారు. 'తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే మల్లు భట్టి విక్కమార్కతో వైఎస్ జగన్‌‌కు ఎప్పటి నుంచో మంచి పరిచయాలు ఉన్నాయి. మల్లు భట్టి విక్రమార్కకు వైఎస్ జగన్ తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం.. అలాగే ఆయన కుమారుడు వైఎస్ జగన్‌తో అనుబంధం ఉంది.మల్లు భట్టి విక్రమార్క తన ఇంట్లో ఉన్న పూజ గదిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో.. ఆయన ఫోటోను పెట్టుకున్నారు. విక్రమార్క 2023 డిసెంబర్ 7న డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు.. ఆయన తన నివాసంలో ఉన్న పూజ గదిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్సార్ తనను రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని విక్రమార్క ఎప్పుడూ చెబుతుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భట్టికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. 2009లో భట్టికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది వైఎస్సార్.. అందుకే ఆయనంటే అభిమానం ఉంది. 2009 నుంచి విక్రమార్క మధిర నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో మల్లు భట్టి విక్రమార్క వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విక్రమార్కకు వైఎస్ జగన్ ఆహ్వానం పలికారు. అనంతరం తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను భట్టి విక్రమార్క వైఎస్ జగన్‌కు అందజేసి.. ఈ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని కోరారు. ఇద్దరు నేతలు కొద్దిసేపు తాజా పరిణామాలపై చర్చించుకున్నారు. అందుకే ఇవాళ విక్రమార్క పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కూడా తెలంగాణ డిప్యూటీ సీఎంకు విషెస్ చెబుతున్నారు.