: మీరు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారా? స్టాక్ మార్కెట్ అంటే రిస్క్ ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ మంచి స్టాక్స్‌ను కొనుగోలు చేయాలంటే కనీసం 500, 100 షేర్లను కొనాలన్నా వేలల్లో వెచ్చించాల్సి ఉంటుంది. కచ్చితమైన రిటర్న్స్ వస్తాయా అంటే చెప్పడం కష్టమే. దీనికి ప్రత్యామ్నాయంగా మ్యూచువల్ ఫండ్స్ కాస్త తక్కువ రిస్క్‌తో దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ అందిస్తుంటాయి. ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్లలో సిప్ రూపంలో చాలా చిన్న మొత్తాల్లోనూ ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. ఒకప్పుడు కనీస సిప్ రూ. 500, రూ. 1000 గా ఉండగా.. ఇటీవలి కాలంలో రూ. 100, రూ. 200 సిప్ స్కీమ్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. '' పేరిట సరికొత్త సిప్ పెట్టుబడుల విధానాన్ని లాంఛ్ చేసింది. ఇక్కడ మదుపరులు రోజువారీగా ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో కనీసం రూ. 10 నుంచి కూడా పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తుండటం విశేషం. ఇది రోజువారీ స్కీమ్. అంటే రోజూ కనీసం రూ. 10 ఇన్వెస్ట్ చేయాలన్నమాట. రూ. 10 సిప్.. 2 స్కీమ్స్..అయితే కనీసం 2 పథకాల్ని ఎంచుకోవాలి. ఈ లెక్కన రెండు పథకాల్లో కలిపి ఒక రోజులో కనీసం రూ. 20 సిప్ చేయొచ్చు. గరిష్ఠ పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. అంటే ఎంతైనా ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందన్నమాట. ఇక కనీసం 2 పథకాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉండగా.. గరిష్ఠంగా మాత్రం 10 పథకాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, మల్టీ క్యాప్ ఫండ్, బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్, లార్జ్ క్యాప్ ఫండ్, గోల్డ్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ వంటివి ఉన్నాయి. అందరికీ కచ్చితంగా నెలకు రూ. 500, రూ. 1000 ఇలా కాస్త పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కుదరకపోవచ్చు. ఇంకా ముఖ్యంగా తొలిసారి పెట్టుబడులు చేయాలనుకునే వారు కూడా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకు తక్కువ ఆసక్తి చూపిస్తారు. రోజువారీ కూలీలు, మహిళలు, విద్యార్థులు, తక్కువ పొదుపు చేసేవారు, తొలిసారి ఇన్వెస్ట్ చేసే వారికి ఇది అనుకూలంగా ఉంటుందని సంస్థ పేర్కొంది. బెనిఫిట్స్ ఇవే..ఇక్కడ రోజుకు కనీసం రూ. 10 తో పెట్టుబడి ప్రారంభించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. నెలవారీగా మీ బడ్జెట్‌పైనా పెద్దగా ప్రభావం పడదు. మీ పెట్టుబడి ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. రోజువారీ పెట్టుబడులు పెట్టడం వల్ల రూపీ కాస్ట్ యావరేజింగ్ నుంచి ప్రయోజనం పొందుతారు. ఇది మీరు వివిధ మార్కెట్ పరిస్థితుల్లో మీ పెట్టుబడుల్ని విస్తరించేందుకు దోహదం చేస్తుంది. రోజూ ఇన్వెస్ట్ చేస్తుండటం వల్ల అధిక కాంపౌండింగ్ ప్రయోజనం పొందొచ్చు. ఇది దీర్ఘకాలంలో మీకు అధిక సంపద తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరుగుతున్న కొద్దీ మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా సిప్ మొత్తాన్ని పెంచుతూ పోవడం వల్ల ఇంకా మీ లక్ష్యాల్ని చేరుకునేలా అధిక రాబడి అందుకోవచ్చు.