Govt : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మరోసారి దూకుడు పెంచింది. ఇటీవల పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర పీఎస్‌యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వాటా విక్రయం విషయంలో దూసుకెళ్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 5 PSU సంస్థల్లో ఓఎఫ్ఎస్ రూపంలో వాటాల విక్రయంతో రికార్డు స్థాయిలో రూ. 16 వేల కోట్ల వరకు నిధుల్ని సమీకరించింది కేంద్రం. ఇప్పుడు ఇదే దూకుడును పూర్తి ఆర్థిక సంవత్సరానికి కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మరో 3 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పుడు ఇక్కడ ఓఎఫ్ఎస్ కోసం లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB), యూకో బ్యాంకుల్లో వాటా విక్రయించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. వీటన్నింటిలో కలిపి సుమారు 8-10 శాతం వరకు వాటా విక్రయించడం ద్వారా ఏకంగా రూ. 13 వేల కోట్లు ఖజానాకు చేరనున్నట్లు అంచనా వేస్తోంది మోదీ సర్కార్. ఇక్కడ వాటా విక్రయం ప్రధానంగా మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా జరుగుతోంది. సెబీ రూల్స్ ప్రకారం స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయిన కంపెనీల్లో పబ్లిక్ షేర్ హోల్డింగ్ కనీసం 25 శాతంగా ఉండాలి. అంటే ప్రమోటర్లు కాకుండా మిగతా విదేశీ పెట్టుబడిదారులు, దేశీయ పెట్టుబడిదారులు, సాధారణ పెట్టుబడిదారుల వాటా కనీసం 25 శాతంగా ఉండాలి. ప్రస్తుతం చూస్తే పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వ వాటా 93.85 శాతంగా ఉండగా, యూకో బ్యాంకులో 92.44 శాతం, ఐఓబీలో 90.95 శాతం ఉంది. దీంతో సెబీ నిబంధనల ప్రకారం చూస్తే భారీగా విక్రయించాల్సి వస్తుంది. అయితే దీనిని ఒకేసారి కాకుండా పలు విడతల్లో ఆఫర్ ఫర్ సేల్ నిర్వహించి కొన్నేళ్లలో సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని చూస్తోంది. ఇక ఈ 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణ, వాటా విక్రయం ద్వారా . దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటన చేశారు. ఇందులో ఇప్పటికే 5 PSU ల్లో వాటా విక్రయంతో రూ. 16 వేల కోట్ల వరకు ఖజానాకు చేరాయి. వీటిల్లో చూస్తే ముందుగా కోల్ ఇండియా ఓఎఫ్ఎస్‌తో రూ. 5542 కోట్లు, NHPC నుంచి రూ. 4357 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటా విక్రయంతో రూ. 2266 కోట్లు, ఎన్ఎల్‌సీ ఇండియాలో రూ. 1223 కోట్లు, నుంచి రూ. 3 వేల కోట్లు సమకూరాయి.