ఆ ఇళ్ల స్థలాల పంపిణీకి ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు.. బాగోతాన్ని బయటపెట్టిన యాంకర్ ఝాన్సీ

Wait 5 sec.

గత కొన్నిరోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న 24 క్రాఫ్ట్స్‌కి సంబంధించిన కార్మికులందరికీ ఏపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించబోతుందనే ప్రచారం జరుగుతుంది. కేవలం ఇది ప్రచారమే కాదు.. వివిధ రకాల హౌసింగ్ కార్పొరేషన్ పేర్లతో ఆర్గనైజేషన్‌లు ఏర్పడి దండిగా డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. ఇందులో సినిమా, టీవీ ఆర్టిస్ట్‌లే కాదు.. సినిమా జర్నలిస్ట్‌లు కూడా ఉండటం విశేషం. ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి.. సినిమా వాళ్లకి ఇళ్లు ఇప్పించబోతున్నారని.. స్థలాలు పరిశీలన చేస్తున్నారంటూ సినీ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తున్న మాట ఇది. అయితే ఏపీ ప్రభుత్వం సినిమా వాళ్లకి ఇళ్ల స్థలాలను కేటాయించబోతున్నారనే వార్తల్ని ఖండిస్తూ క్లారిటీ ఇచ్చారు . ఈమె క్లారిటీ ఇవ్వడానికి ఈమెకి ఏం సంబంధం అంటే.. ఇఫ్పుడు ఝాన్సీ యాంకర్ మాత్రమే కాదు.. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటైన APFDC బోర్డు డైరెక్టర్‌ కూడా. ఇటీవల యాంకర్ ఝాన్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన 'ఎపి ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' (APFDC) డైరెక్టర్‌గా నియమితులు కాగా.. ఈ ఇళ్ల స్థలాల వ్యవహారం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ‘ఈరోజు నేను సినిమా షూటింగ్‌లో ఉండగా.. మా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి ఒకరు వచ్చి.. సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్లందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించబోతుంది. అందులో సభ్యత్వం తీసుకోమని కొంతమంది ప్రచారం చేస్తున్నారూ ఇది వాస్తవమేనా? ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మనకి ఇళ్ల స్థలాలు ఇస్తుందా? అని అడిగారు. కేవలం ఆయనే కాదు.. మా మేకప్‌మ్యాన్‌తో సహా చాలామంది ఇదే మాట అడిగారు. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నవాళ్లంతా ఇది జాగ్రత్తగా వినండి. నేను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలెప్‌మెంట్ బోర్డ్ ఆఫ్ మెంబర్‌గా చెప్తున్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి బిల్డింగ్ వెల్ఫేర్ సొసైటీకి ల్యాండ్ ఇవ్వలేదు. మరి వీళ్లు చేస్తున్నాది మోసమా? స్క్రీన్‌పై చూపిస్తున్నట్టుగా ఒక వెల్ఫేర్ సొసైటీ పెట్టి డబ్బులు వసూలు చేయడం తప్పంటారా? మీరే ఆలోచించండి. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కోపరేటివ్ సొసైటీ పెట్టి.. ఇలా చేస్తున్నారు కాబట్టి.. అసలు ఆ వ్యక్తులు ఇస్తున్న భరోసా ఏంటి? ఆ వ్యక్తులు నమ్మొచ్చా లేదా అన్నది మీరే తెలుసుకోవాలి. ముందుగా మీ బాధ్యత ఏంటంటే.. దానికి చట్టబద్దత ఉందా? లేదా?? ఆ హౌసింగ్ సొసైటీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా ఎవర్ని ఎంచుకున్నారు? అది అసలు రిజిస్టర్ అయ్యి ఉందా? లేదా? ఇలా డబ్బులు వసూలు చేసి ఎక్కడ స్థలం కొనాలని అనుకుంటున్నారు? కొన్న స్థలాన్ని ఎలా కేటాయిస్తారు? ఇటువంటి వివరాలన్నీ మీరు సవివరంగా తెలుసుకోండి. అంతేతప్ప ఇది ఏ ప్రభుత్వం చేస్తుంది. లేదంటే తెలుగు ఇండస్ట్రీలో పెద్దలంతా కలిసి చేస్తున్నారూ.. ఫెడరేషన్ వాళ్లు చేస్తున్నారూ.. ఇటువంటి పేర్లతో మిమ్మల్ని నమ్మించే ప్రయత్నంచేస్తే అది తప్పుగా ప్రచారం జరుగుతుంది. ఈ రెండింటికీ సంబంధం లేదు. వాళ్లు గురించి పూర్తిగా తెలుసుకుని మీకు నమ్మకం కుదిరితే ఆ ఫెడరేషన్‌లో చేరండి తప్ప.. వాళ్ల వెనుక ప్రభుత్వం నిలబడి.. సినిమా వాళ్లకి ఇళ్ల స్థలాలు కేటాయించడం లేదు. అదంతా ప్రచారం మాత్రమే’ అంటూ క్లారిటీ ఇచ్చారు యాంకర్ .