మహారాష్ట్రలో కుప్పకూలిన హనుమాన్ ఆలయ మండపం.. ఆరుగురు మృతి, శిథిలాల కింద మరో 30 మంది?

Wait 5 sec.

మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పర్బాణీ జిల్లా యశ్వాడీలో ఓ ఆలయ మండపం కుప్పకూలింది. శనివారం ఉదయం హనుమాన్ ఆలయ మండపం కూలి.. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరో 30 మంది వరకు చిక్కుకున్నట్టు సమాచారం. ప్రమాదంలో పలువురు భక్తులు గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, శనివారాల్లో సాధారణంగా హనుమాన్ ఆలయాల వద్ద భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో దర్శనం కోసం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ సమయంలో నిర్మాణంలో ఉన్న మండపం పైకప్పులోని ఓ భాగం, సపోర్టింగ్ పిల్లలు అకస్మాత్తుగా కూలిపోయాయి. శిథిలాలు అక్కడ నిలబడి ఉన్న భక్తులపై పడ్డాయి. భయాందోళనలకు గురైన జనం పరుగులు తీశారు. ఘటనలో కనీసం 8 నుంచి పది మంది భక్తులకు తీవ్రగాయాలయ్యాయని, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారని స్థానికులు చెబుతున్నారు. పలువురు చనిపోయి ఉంటారని భావిస్తుండగా.. అధికారులు ఇప్పటి వరకూ మృతుల సంఖ్యపై ప్రకటన చేయలేదు.మండపం గత కొన్ని రోజులుగా నిర్మాణంలో ఉందని సమాచారం. ఈ ఘటన నిర్మాణ పనులలో నాణ్యత, భద్రతా నిబంధనల ఉల్లంఘన తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు, అయితే కూలిపోవడానికి గల కచ్చితమైన కారణం, ఎంతమంది ప్రభావితమయ్యారు అనే దానిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.