మరోసారి వైరల్ అయిన 'మెలోడీ'.. 'ఇన్‌స్టాలో మనమే ఫేమస్' అంటూ మోదీ-మెలోనీ సరదా సంభాషణ

Wait 5 sec.

మెలోడి అనే పేరు చెప్పగానే ఠక్కును గుర్తొచ్చేది చాక్లెట్ కాదు మెలోని - మోదీనే. మెలోడి చాక్లెట్ ఎంత ఫేమస్సో.. మెలోడి కపుల్ కూడా అంతే ఫేమస్. ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ 7 సమ్మిట్‌లో మెలోడి మరోసారి వైరల్ అయింది. భారత ప్రధాని మోదీ - ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. జీ7 సదస్సులో గ్రూప్ ఫొటో సందర్భంగా ఇటలీ ప్రధాని మెలోనీ, భారత ప్రధాని మోదీని ఆప్యాయంగా పలకరించారు. మిమ్మల్ని మళ్లీ కలవడం ఆనందంగా ఉందని మెలోనీ చెప్పగా.. మోదీ ఏదో అన్నారు.. దాంతో మెలోని నవ్వుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఫేమస్ కపుల్ అంటూ అనేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెలోని, మోదీ పేర్లు కలిపిన నెటిజన్లు మెలోడీ ట్రెండ్ సృష్టించిన విషయం తెలిసిందే. 2023లో దుబాయ్ వేదికగా జరిగిన ఓ సదస్సులో ఈ ట్రెండ్ మొదటిసారిగా మొదలైంది. అప్పట్లో మెలోనీ, మోదీతో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మెలోడీ హ్యాష్ ట్యాగ్ ఉపయోగించారు. అప్పటి నుంచి ఇద్దరు నేతలు కలిసిన ప్రతిసారీ మీమ్స్, పోస్టులు వైరల్ అవుతున్నాయి. గత నెలలో మోదీ ఇటలీ పర్యటన సందర్భంగా మెలోనికి మెలోడి టాఫీ బ్రాండ్ ప్యాకెట్‌ను బహుమతిగా అందించారు. గతంలో వైరల్ అయిన మెలోడి పేరును సరదాగా గుర్తు చేస్తూ ఇచ్చిన ఈ గిఫ్ట్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మోదీ ఇచ్చిన బహుమతికి మెలోనీ స్పందిస్తూ ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. తాజాగా జీ7 సదస్సు గ్రూప్ ఫొటో సమయంలో మోదీ - మెలోనీ మధ్య ఓ చిన్న సరదా సంభాషణ జరగడం, ఆ వెంటనే మెలోడీ ఫేమస్ కపుల్ అనడంతో మరోసారి వైరల్ అయ్యారు. ఈ వీడియోపై నెటిజన్లు మెలోడి క్రాస్ ఓవర్ అంటూ కామెంట్లు చేయడం ఆసక్తికరం.