సామాన్యుల కోసం 'చౌక' ధరకే ఫ్లైట్ టికెట్లు.. ఎయిరిండియాలో కొత్తగా 'బేసిక్' ఫేర్ ఆప్షన్.. దేశీయంగా ఎక్కడికైనా వెళ్లొచ్చు!

Wait 5 sec.

Flight Ticket: ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఎయిరిండియా మరోసారి సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఎంపిక చేసిన దేశీయ విమాన మార్గాల్లో చౌక ధరకే ఫ్లైట్ టికెట్లు అందిస్తున్నట్లు తెలిపింది. దేశీయ మార్గాల్లో కాంప్లిమెంటరీ భోజనం లేకుండా ప్రాథమిక ఛార్జీని ఎంచుకునే అవకాశాన్ని అందిస్తున్నట్లు పూర్తి స్థాయి విమాన సేవల సంస్థ ఎయిరిండియా కలిగించుంది. () అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎయిరిండియా తెలిపింది. ఎలా ప్రయాణించాలి, ఎంత చెల్లించాలి అనే విషయంలో తమ కస్టమర్లకు పూర్తి అవకాశాన్ని, అధికారాన్ని కల్పించాలనే తమ సంకల్పంలో భాగంగా ఈ కొత్త ఆప్షన్ తీసుకొచ్చినట్లు తెలిపింది.'కొత్త బేసిక్ ఫేర్ ఆప్షన్ కింద ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించవచ్చు. 15 కిలోల చెక్ ఇన్ బ్యాగేజీ, 7 కిలోల కేబిన్ బ్యాగేజీకి అనుమతి ఉంటుంది. కాంప్లిమెంటరీ భోజనం ఉండదు. ఫ్రీగా టీ, కాఫీ ఫండ్ పానీయాలు మాత్రమే లభిస్తాయి.' అని ఎయిరిండియా తన అధికారిక వెబ్‌సైట్లో ఈ బేసిక్ ఫేర్ ఆప్షన్ వివరాలను పేర్కొంది. వీటిల్లో కాంప్లిమెంటరీ భోజనంతో పాటు, ఇతర ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ చౌక టికెట్లు ప్రయోగాత్మక పద్ధతిలో, ఎంపిక చేసిన రూట్లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. దీనిపై వినియోగదార్ల స్పందన ఆధారంగా ఈ ఛార్జీల కొనసాగింపు ఉంటుందని పేర్కొంది.ఈ బేసిక్ ఫేర్ ఆప్షన్ అనేది పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణికులు ఎయిర్ ఇండియా ప్రస్తుత ఛార్జీల శ్రేణులైన వాల్యూ, క్లాసిక్, ఫ్లెక్స్ లలో బుక్ చేసుకునే ఎంపికను కలిగి ఉన్నారు. వీటిలో ప్రతి ఒక్కటి క్రమంగా పెరుగుతున్న ధరలకు ఉచిత భోజనం, అనేక రకాల బండిల్ ప్రయోజనాలను అందిస్తాయి. బేసిక్ ఫేర్‌ను ప్రవేశపెట్టడం అనేది, ముఖ్యంగా ధరల పట్ల శ్రద్ధ వహించే, మరిన్ని ప్యాకేజీలను విడిగా కోరుకునే ప్రయాణికులకు, కేవలం మరో స్థాయి ఎంపికను మాత్రమే అందిస్తుంది. అలాగే బేసిక్ ఫేర్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు సైతం భోజనం బుక్ చేసుకోవచ్చు. ప్రయాణం మొదలయ్యే 24 గంటల్లోపూ మీల్స్ ఆర్డర్ చేసుకునే వెసులుబాటు సైతం ఇస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. శాకాహారం, మాంసాహారం, జైన్, డయాబెటిక్ మీల్స్ ఉంటాయని పేర్కొంది.