Oneplus Price Hike: దేశంలో స్మార్ట్ ఫోన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచ వాణిజ్యంపై అనిశ్చితులు నెలకొన్న క్రమంలో పెరుగుతున్న ముడి పదార్థాల ధరలతో ఫోన్ల ధరలను కంపెనీలు పెంచేస్తున్నాయి. రోజు రోజుకూ మరింత కాస్ట్ లీగా మారిపోతున్నాయి. తాజాగా వన్‌ప్లస్ (OnePlus) మరోసారి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాదిలోనే రెండోసారి ధరలు పెంచడం గమనార్హం. తన వన్ ప్లస్ 15, నార్డ్ సీఈ6 లైట్ ఫోన్ల ధరలను రూ. 8 వేల వరకు పెంచుతున్నట్లు తెలిపింది. సవరించిన ధరలను వన్‌ప్లస్ కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్లో అమలులోకి వచ్చాయి. ఫోన్ విడి భాగాల ధరలు పెరిగిన క్రమంలోనే తమ ఫోన్ల ధరలను పెంచాల్సి వచ్చినట్లు కంపెనీ పేర్కొంది.వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ ధర 12 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధరను రూ. 77,999 నుంచి రూ. 85,999కు పెంచుతున్నట్లు కంపెనీ పెరిగింది. ఈ ఫోన్ విడుదల సమయంలో దీని ధర రూ. 72,999 కావడం గమనార్హం. అంటే దాదాపు రూ. 13 వేల వరకు పెరిగింది.అలాగే వన్ ప్లస్ 15 ఫోన్ 16 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ. 85,999 నుంచి రూ. 93,999కు పెంచారు. అంటే దాదాపు రూ. 8 వేలు పెరిగింది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్ స్మార్ట్ ఫోన్ ధర కూడా రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు పెరిగింది. ఇక 6జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ. 22,999 నుంచి రూ. 25,999 వరకు పెరిగింది. 8 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ. 25,999 నుంచి రూ. 27,999కు పెంచారు. 8 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ స్మార్ట్ ఫోన్ ధర రూ. 28,999 నుంచి రూ. 30,999లకు పెంచారు.వివో, లావా ధరలూ పెరిగాయ్మరో రూ. 4 వేల వరకు పెంచింది. వివో వీ70 (Vivo V70), వీ 70 ఎలైట్ (V70 Elite), వై 21, (Y21), వై 400 సిరీస్ ఫోన్ల ధరలను చేపట్టింది. అదే విధంగా దేశీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా (Lava) సైతం తన ఫోన్ల ధరలను పెంచింది. లావా ఎన్1 (Lava N1), లావా బోల్డ్ 2 (Lava Bold 2) స్మార్ట్ ఫోన్ ధరలను రూ. 15 వందల వరకు పెంచింది.