Stock Split: స్మాల్ క్యాప్ కేటగిరిలోని ఇండస్ట్రియల్ గూడ్స్ సెక్టార్ సంస్థ టెంబో గ్లోబల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ () తమ షేర్ హోల్డర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ షేర్ హోల్డర్ల అకౌంట్లలోని షేర్ల సంఖ్యను ఒక్కసారిగా 10 రెట్లు పెంచే ప్రకటన చేసింది. తెలిపింది. దీంతో 1 షేరు కొంటే 10 షేర్లు, 100 షేర్లు కొంటే 1000 షేర్లుగా మారనున్నాయి. మరోవైపు ఈ కంపెనీ షేరు గత ఏడాదిలో 19 శాతం లాభాన్ని ఇచ్చింది. ఈ తర్వాత ప్రస్తుతం రూ. 560 స్థాయిలో ఉన్న ఈ షేర్ ధర రూ. 56ల స్థాయికి పడిపోనుంది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. ఇటీవలే జరిగిన కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో కంపెనీస్ యాక్ట్ 2013లోని సెక్షన్ 61కి అనుగుణంగా 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టాలని నిర్ణయించారు. అంటే రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న ఒక ఈక్విటీ షేరుని రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండేలా 10 షేర్లుగా విభజిస్తారు. ఈ స్టాక్ స్ప్లిట్ సంబంధించిన రికార్డు డేట్ త్వరలోనే బోర్డు డైరెక్టర్స్ ప్రకటించనున్నారని కంపెనీ తెలిపింది.స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్లో టెంబో గ్లోబల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు సుమారు 1.37 శాతం నష్టంతో రూ. 560 వద్ద స్థిరపడింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 837 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 433.35 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 1 శాతం నష్టపోగా గత నెల రోజుల్లోనూ 1 శాతం నష్టంతో ట్రేడవుతోంది. గత ఆరు నెలల్లో ఈ షేరు 23 శాతం పడిపోయింది. గత ఏడాది కాలంలో 19 శాతం లాభాన్ని అందించింది. ఐదేళ్ల క్రితం లక్ష రూపాయలు పెట్టి కొనసాగిన వారికి ఇప్పుడు రూ. 2.77 లక్షలకు పైగా వస్తాయి. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 1040 కోట్ల వద్ద ఉంది.ఈ కథనం కేవలం సమాచారం ఇవ్వడానికే. ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించడం లేదు. స్టాక్ మార్కెట్ అంటేనే హైరిస్క్ ఉంటుంది. ఎంచుకున్న స్టాక్ గురించి, స్టాక్ స్ప్లిట్ గురించి ముందే తెలుసుకోవాలి. స్టాక్ స్ప్లిట్ చేసినప్పుడు షేరు ధర భారీగా తగ్గుతుంది. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.