భారత క్రికెట్ చరిత్రలో నేడు అరుదైన రోజు.. ఒకే రోజు బరిలోకి 3 టీమిండియా జట్లు!

Wait 5 sec.

భారత క్రికెట్ చరిత్రలో బుధవారం అంటే జూన్ 17, 2026 ప్రత్యేకంగా నిలవబోతోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు భారత జట్లు నేడు క్రికెట్ ఆడనున్నాయి. మూడు విభిన్న జట్లే అయినప్పటికీ.. క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని అందించనున్నాయి. భారత పురుషుల జట్టు అఫ్ఘానిస్థాన్‌తో, మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ 2026లో నెదర్లాండ్స్‌తో.. పురుషుల ఇండియా-ఏ జట్టు, అఫ్ఘానిస్థాన్-ఏతో తలపడనుంది. ఒక్కో మ్యాచుకు ఒక్కో ప్రత్యేకత ఉండటంతో.. వీటిపై ఆసక్తి నెలకొంది.భారత్ vs అప్ఘానిస్థాన్..ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్ పురుషుల జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా రెండో వన్డే నేడు లక్నో వేదికగా జరగనుంది. మధ్యాహ్నం 1.30కి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఇవాళ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ చేజిక్కించుకోనుంది. సీనియర్ ప్లేయర్ రోహిత్ ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.మహిళల టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో..పాకిస్థాన్‌ను చిత్తు చేసి నేడు మరో మ్యాచుకు సిద్ధమైంది. లీడ్స్ వేదికగా నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో గెలిచి.. సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని భారత మహిళల జట్టు పట్టుదలతో ఉంది.ఇండియా-ఏ vs అప్ఘానిస్థాన్-ఏ..శ్రీలంక వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచులలో ఓడిపోయిన భారత-ఏ జట్టు కీలకమ్యాచుకు సిద్ధమైంది. నేడు దంబుల్లా వేదికగా అఫ్ఘానిస్థాన్-ఏ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. గత మ్యాచులో ఈ మ్యాచులో ఎలా రాణిస్తారనేది చూడాలి. ఎందుకంటే ఈ మ్యాచులో ఓడిపోతే.. భారత-ఏ జట్టు ఫైనల్ చేరకుండానే ఈ సిరీస్ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిస్తే మాత్రం ఫైనల్ అవకాశాలు మెరుగుపడతాయి. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. మొత్తంగా బుధవారం భారత క్రికెట్ అభిమానులకు తీన్మార్ థ్రిల్లింగ్ లభించనుంది.