అర్ధరాత్రి సమయంలో అల్లుడి నుంచి ఆ ఫోటో వచ్చింది.. రాధా గాయత్రి తండ్రి అనుమానాలు..

Wait 5 sec.

కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ ముస్సోరిలోని ఓ హోటల్ గదిలో రాధా గాయత్రి అనుమానాస్పద రీతిలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మీద.. ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. సుధాకర్ ఫిర్యాదు ఆధారంగా ముస్సోరి పోలీసులు శ్రీచరణ్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రాధా గాయత్రి కుటుంబానికి శ్రీచరణ్ తప్పుడు సమాచారం ఇచ్చారని ముస్సోరి పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. రాధా గాయత్రి, శ్రీచరణ్‌లకు గతేడాది నవంబర్ నెలలో పెళ్లి జరిగింది. ఇద్దరూ గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేసేవారు. అయితే ఇటీవల దంపతులు ఇద్దరూ ఉత్తరాఖండ్ విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలోనే జూన్ 14వ తేదీ ముస్సోరిలోని ఓ హోమ్ స్టేలో బస చేశారు. అక్కడే రాధా గాయత్రి అనుమానాస్పద రీతిలో చనిపోయారు. రాధా గాయత్రి ముక్కు నుంచి రక్తం వచ్చిన సూచనలు కనిపించటంతో అక్కడి పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కుమార్తె మరణానికి సంబంధించి అల్లుడిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ముస్సోరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఆధారాలు సమర్పించారు. వీటి ఆధారంగా పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. "హరిద్వార్, రిషికేష్ యాత్ర గురించి చెప్పారే కానీ.. ముస్సోరి వెళ్తున్నట్లు, అక్కడ బస చేస్తున్నట్లు చెప్పలేదు. ఎన్నడూ లేనట్లుగా జూన్ 14వ తేదీ అర్ధరాత్రి సమయంలో.. భార్యాభర్తలు సన్నిహితంగా ఉన్న సెల్ఫీ అల్లుడు శ్రీచరణ్ ఫోన్ నుంచి వచ్చింది. మా కుమార్తెకు (రాధాగాయత్రి) ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. రక్తపోటు ఉందని శ్రీచరణ్ పోలీసులకు అబద్ధం చెప్పాడు. రాత్రి తిన్న ఆహారంలో ఏమైనా కలిపి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. బ్యాగులో జీపీఎస్ ట్రాకర్ ఎందుకు పెట్టాడు, మద్యం తాగినట్లు చెప్తున్నాడు, అందులో ఏమైనా కలిపి బలవంతంగా తాగించాడా అనే అనుమానాలు ఉన్నాయి." అంటూ ఫిర్యాదులో సుధాకర్ పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా వీడియో కాల్స్ చేయమని వేధించేవాడని,, మానసికంగా ఒత్తిడికి గురిచేసేవాడని సుధాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనకు ముందు 48 గంటల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలు పరిశీలించాలని.. హోటల్ సీసీటీవీ ఫుటేజ్, కమ్యూనికేషన్ రికార్డులను అధ్యయనం చేయాలని ముస్సోరి పోలీసులను సుధాకర్ కోరారు. అలాగే రాధా గాయత్రి, శ్రీచరణ్ వాట్సాప్ చాట్‌లలో ఏముందో పరిశీలించాలని కోరారు.