Car Tax: కార్లు కొనుగోలు చేసే వారిలో చాలా మంది ఈ విషయం తెలియదు. కొత్త కారు కొన్నప్పుడు ప్రభుత్వం మీ డబ్బు మీకు తిరిగి చెల్లిస్తుంది. అవునండీ మీరు చదివింది నిజమే. అందుకు కారు కొనుగోలు చేసినప్పుడు ఓ చిన్న పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో సొంత కారు ఉండాలని చాలా మంది అనుకుంటున్నారు. రూ.10 లక్షలు ఆపైన ధర ఉండే లగ్జరీ కార్లనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (TCS) అదనపు పన్ను కాదని చాలా మందికి తెలియదు. మీ తరపున ముందస్తుగా చెల్లించిన ట్యాక్స్. దీనిని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. అది ఎలాగో మనం తెలుసుకుందాం.రూ.10 లక్షలపైన ధర గల కారు కొన్నప్పుడు డీలర్ మీ వద్ద 1 శాతం టీసీఎస్ వసూలు చేస్తారు. రూ.10 లక్షల కారుపై రూ.10 వేలు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. రూ.30 లక్షల కారుకు రూ.30 వేలు టీసీఎస్ కట్ చేస్తారు. ఈ డబ్బు అదనపు ట్యాక్స్ కాదని చాలా మందికి తెలియదు. మీ డబ్బులను మీరు తిరిగి పొందవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియక నష్టపోతున్నారు. అదనపు ట్యాక్స్ గా భావించి వదిలేస్తున్నారు. ఈ డబ్బును తిరిగి ఈజీగా పొందవచ్చు.ప్రాసెస్ ఇదేకారు కొనుగోలు చేసినప్పుడు డీలర్ దగ్గర ఫారం 27డీ తీసుకోవాలిఐటీఆర్ ఫైల్ చేసే టైంలో మీ ఫారం 26ఏఎస్ చెక్ చేసుకోవాలిఫారం 26ఏఎస్‌లో కారుపై చెల్లించిన టీసీఎస్ ఉంటుంది.మీ ట్యాక్స్ ఫైలింగ్ ద్వారా క్లెయిమ్ చేస్తే రీఫండ్ ఇస్తారు.ఇక్కడ ఎటాంటి ట్రిక్ లేదు, కనిపించని నిబంధన లేదు. మీ అడ్వాన్స్ ట్యాక్స్‌ను క్లెయిమ్ చేసుకోవడమే. మీరు రూ.10 లక్షలకుపైన ధర ఉన్న కారు కొనుగోలు చేస్తే మీరు మీ ట్యాక్స్ డబ్బును వదిలేసికోవద్దు. ఫారం 27డీ తీసుకుని రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఆ డబ్బు తిరిగి చెల్లిస్తుంది. మీరు చెల్లించాల్సిన ట్యాక్స్ కంటే చెల్లించిన టీసీఎస్ ఎక్కువగా ఉంటే ఆ అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. కారు కొనుగోలు చేసినప్పుడు టీసీఎస్ సర్టిఫికెట్ తీసుకోవడం మీరు చేయాల్సిన పని. ఆ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి.