రెచ్చగొడితే రచ్చ రచ్చే.. శ్రీలంక-ఏ బౌలర్లకు నరకం చూపించిన వైభవ్ సూర్యవంశీ..!

Wait 5 sec.

శ్రీలంక వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో 15 ఏళ్ల విశ్వరూపం చూపించాడు. శ్రీలంక-ఏతో జరుగుతున్న ఫైనల్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. గత మ్యాచులో శ్రీలంక-ఏ ఆటగాళ్లు మాటలతో కవ్వించిన విషయం మనసులో పెట్టుకున్నాడో ఏమోగానీ.. కనీవినీ విధ్వంసం సృష్టించాడు. లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఏకంగా 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు చేరుకున్నాడు. దీంతో శ్రీలంక-ఏ బౌలర్లపై రివేంజ్ తీర్చుకున్నాడు.దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏ జట్టుతో భారత-ఏ జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఈ టోర్నీలో ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని వైభవ్.. ఈ మ్యాచులో మాత్రం చుక్కలు చూపించాడు. గత మ్యాచులో సూపర్ ఓవర్‌లో ఓడిపోయాక.. వైభవ్‌ను లంక ఆటగాళ్లు రెచ్చగొట్టారు. దీంతో ఈ మ్యాచులో లంక వర్సెస్ వైభవ్ పోరు ఉంటుందని అంతా భావించారు. వారి అంచనాలను నిజం చేస్తూ వైభవ్ ఊచకోత కోశాడు.క్రీజులో అడుగుపెట్టింది మొదలు బాదడమే పనిగా పెట్టుకున్నాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతిని ఫోర్‌గా మలిచి.. తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు. ఆ తర్వాత వరుసగా 4, 4, 6, 6 కొట్టాడు. ఆరో బంతిని మాత్రం డాట్ చేశాడు. ఆ తర్వాత 6, 4, 4, 6, 6 కొట్టి కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో లిస్ట్ ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డుకు శ్రీలంకకు చెందిన కౌశల్య వీరరత్నే పేరిట ఉండేది. 2005లో అతడు 12 బంతుల్లో ఫిఫ్టీ కొట్టాడు.హాఫ్ సెంచరీ తర్వాత కూడా వైభవ్ జోరు కొనసాగించాడు. సెంచరీ దిశగా వడివడిగా అడుగులు వేశాడు. చివరకు 29 బంతుల్లో 94 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి.