Tirumala: బంగారంతో ఉన్న బ్యాగును పోగొట్టుకున్న భక్తుడు.. కమాండ్ కంట్రోల్ సెంటర్ చొరవతో గంటల్లోనే అప్పగింత

Wait 5 sec.

శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఓ భక్తుడు రూ.7 లక్షల విలువైన బంగారంతో ఉన్న బ్యాగును పొగొట్టుకోగా.. గంటలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది చొరవతో అది తిరిగి అతడి చెంతకు చేరింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణకు చెందిన భక్తుడు వంగ మల్లేష్ గౌడ్, అతడి భార్య కలిసి శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం రాత్రి వచ్చారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తూ అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద తన బ్యాగును పొరపాటున మరచిపోయారు. దీంతో వెంటనే రాత్రి 11.30 గంటలకు తిరుపతి దేవస్థానం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా బ్యాగును తీసుకెళ్లిన వాహనం సిబ్బంది గుర్తించారు. తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సంప్రదించాలని వారికి సూచించారు.కమాండ్ కంట్రోల్ సిబ్బంది వాహనాన్ని ట్రేస్ చేసి, తెల్లవారుజామున 3:30 గంటలకు బాలాజీ గెస్ట్ హౌస్ నెం.4 వద్ద ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా బ్యాగును తీసుకెళ్లిన వాహనం TG 07 AD 0269ను గుర్తించారు. ఆ వాహనంలోని లక్ష్మీకాంత్ రెడ్డి అనే భక్తుడు స్కానింగ్ సమయంలో పొరపాటున ఆ బ్యాగు తమ వద్దకు వచ్చిందని వచ్చినట్లు తెలిపారు. దీంతో ఆ బ్యాగును తిరుమలలో కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మల్లేష్ గౌడ్‌కు దానిని అప్పగించారు. అనంతరం బ్యాగును పరిశీలించగా అందులోని 50 గ్రాముల బంగారంతో పాటు అన్ని వస్తువులు యథాతథంగా ఉండటంతో భక్తుడు సంతోషం వ్యక్తం చేశాడు.ఈ సందర్భంగా తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు, సిబ్బంది చొరవ, అప్రమత్తతకు అతడు కృతజ్ఞతలు తెలిపారు. సరైన సమయంలో స్పందించి తిరుమలకు వచ్చే భక్తులకు భరోసా కల్పించారని ఫీడ్ బ్యాక్ పుస్తకంలో భక్తుడు ప్రశంసలు కురిపించారు. అన్న ప్రసాదానికి భక్తులు రూ.20 లక్షల విరాళంహైదరాబాద్ కు చెందిన భక్తుడు వడ్లమూడి లలిత్ కుమార్, శ్రీ యలమంచిలి కృష్ణారావులు శ్రీవారికి భారీ విరాళం అందజేశారు. టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళాల చెక్కులను అప్పగించారు.