అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థలో వాటా అమ్మేస్తున్న కేంద్రం.. 10 శాతం డిస్కౌంట్.. ఖజానాకు రూ. 3 వేల కోట్లు

Wait 5 sec.

: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వాటా విక్రయం ప్రక్రియలో దూకుడుగా వ్యవహరిస్తోంది. వరుస పెట్టి పలు చేపడుతోంది. తాజాగా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GIL RE) సంస్థలో సుమారు 5 శాతం వాటా విక్రయించేందుకు సిద్ధమైంది. ఇక్కడ కూడా ఆఫర్ ఫర్ సేల్ విధానంలోనే వాటాను అమ్మేస్తోంది. దీనికి సంబంధించి సంస్థ సోమవారం రోజు ప్రకటించింది. ఇటీవల వాటా విక్రయాలకు మంచి స్పందన లభించడంతో వరుసగా ఎంపిక చేసిన సంస్థల్లో షేర్లను విక్రయించడం ద్వారా ఖజానాకు పెద్ద మొత్తంలో సొమ్ము వచ్చి చేరుతోంది. ఇక్కడ ఆఫర్ ఫర్ సేల్ విధానంలో మొత్తం ఒకేసారి 5 శాతం వాటాను విక్రయించట్లేదు. ముందుగా 2 శాతం వాటాను అందుబాటులో ఉంచుతుండగా.. దీనికి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి మిగతా 3 శాతం అలా మొత్తం 5 శాతం వాటా విక్రయానికి ప్లాన్ చేసింది. అంటే ఇక్కడ 3 శాతం వాటాను గ్రీన్ షూ లేదా ఓవర్‌సబ్‌స్క్రైబ్డ్ ఆప్షన్ కింద ఉంచింది. మొత్తం వాటా విక్రయిస్తే ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 3090 కోట్ల నిధులు సమకూరతాయి.GIC RE OFS Floor Price:ఈ ఓఎఫ్ఎస్ కింద ఒక్కో ఈక్విటీ షేరు ఫ్లోర్ ప్రైస్ రూ. 352 గా నిర్ణయించింది. సోమవారం రోజు జీఐసీ స్టాక్ క్లోజింగ్ ప్రైస్ రూ. 385.25 కాగా.. అంతకంటే దాదాపు 10 శాతం వరకు తక్కువ ధరకే షేర్లను కొనుగోలు చేసే అవకాశం ఇన్వెస్టర్లకు దక్కుతోంది. ముందుగా జూన్ 16న (మంగళవారం) ఇది నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటుంది. తర్వాత జూన్ 17న రిటైల్ ఇన్వెస్టర్లకు షేర్లను దక్కించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇక్కడ సెబీ పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల్ని పాటించేందుకు కేంద్రం ఈ ఇన్సూరెన్స్ సంస్థలో సుమారు 10 శాతం వాటాల్ని విక్రయించాల్సి ఉంది. ఇందులో భాగంగా 2024 సెప్టెంబరులో 3.4 శాతం వాటాను అమ్మేసింది. దశల వారీగా మిగతా మొత్తం విక్రయం కూడా పూర్తి చేయాలని చూస్తోంది. మార్చి 31 నాటికి ప్రభుత్వానికి ఈ సంస్థలో 82.4 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ విషయానికి వస్తే ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద పునర్బీమా సంస్థ. కంపెనీలు తమకు వచ్చే బీమా నష్టాల్ని తగ్గించుకునేందుకు సహాయపడుతుంది. అంటే రీఇన్సూరెన్స్ అందిస్తుంది. వరుసగా వాటా విక్రయాలు..ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వ సంస్థల్లో వాటాల్ని విక్రయించడం ప్రారంభించిన కేంద్రం మొదట BHEL తో ప్రారంభించింది. తర్వాత వరుసగా IRFC, కోల్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, NHPC, NLC ఇండియాలో ఓఎఫ్ఎస్ నిర్వహించింది. ఇప్పుడు GIL RE వంతు వచ్చింది.