టాటాల నుంచి మరో కొత్త స్కీమ్.. రూ.5000 ఉంటే చాలు.. రేపటి నుంచే షురూ, పూర్తి వివరాలివే

Wait 5 sec.

Tata Multi Fof: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల అభిరుచి, మార్కెట్ పరిస్థితులను బట్టి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు కొత్త కొత్త ఫండ్స్ లాంచ్ చేస్తుంటాయి. తమ పోర్ట్ ఫోలియోల్లోని ఖాళీలను భర్తీ చేస్తూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంటాయి. దీర్ఘకాల మూలధన రాబడులను అందించేలా ఈ ఫండ్స్‌ని డిజైన్ చేస్తుంటారు. తాజాగా ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అదే (). రెగ్యులర్ ప్లాన్‌లోని గ్రోత్ ఆప్షన్‌గా తెలిపింది. ఈ ఫండ్ గురించిన వివరాలు తెలుసుకుందాం.టాటా మల్టీ సెక్టార్ పాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ జూన్ 22, 2026న ప్రారంభమైంది. జులై 6, 206 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5 వేలుగా నిర్ణయించారు. ఆ తర్వాత రూ.1000 చొప్పున ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. కనీస సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ పెట్టుబడి రూ.100 మాత్రమే. ఈ ఫండ్ మేనేజర్‌గా రాహుల్ సింగ్ ఉంటారని ఏఎంసీ తెలిపింది. ఈ స్కీమ్ బెంచ్ మార్క్ నిఫ్టీ 500 టీఆర్ఐగా ఉంది. ఇందులో హైరిస్క్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్లాన్ గా చెప్పవచ్చు.ఆ తర్వాత విత్ డ్రా చేసుకుంటే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ సమయంలో న్యూ ఫండ్ ఆఫర్‌ ద్వారా సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా బ్రోకర్ లేదా మ్యూచువల్ ఫండ్ ప్లాట్ ఫామ్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ డైరెక్ట్, చాయిస్ ఇండియా వంటి ప్లాట్ ఫామ్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.మ్యూచువల్ ఫండ్స్ లోనూ హైరిస్క్ ఉంటుంది. ఎంచుకునే ఫండ్ గురించిన పూర్తి వివరాలు ముందుగానే తెలుసుకోవాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే కొత్తగా మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఎంట్రీ అవుతున్నవారు ఈ న్యూ ఫండ్ ఆఫర్స్‌ జోలికి వెళ్లవద్దని మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. అయితే దీర్ఘకాలంలో క్రమానిగతంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని చెబుతున్నారు.