ఇంగ్లాండ్‌తో వన్డేలకు భారత జట్టు ప్రకటన.. కోహ్లీ ఇన్.. జైశ్వాల్ ఔట్..!

Wait 5 sec.

ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న అతడు.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ వరకు పూర్తిగా కోలుకుంటేనే ఆడతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ లెక్కన ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అయితేనే కోహ్లీ ఈ సిరీస్‌లో ఆడతాడు.అఫ్ఘానిస్థాన్‌తో మూడో వన్డేలో శతకం సాధించినప్పటికీ యశస్వి జైశ్వాల్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. చెన్నైలో శనివారం జరిగిన ఈ మ్యాచులో కానీ జట్టులో చోటు కోసం తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో అతడు.. ఈ స్క్వాడ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. తిరిగి జట్టులోకి వచ్చేశాడు. పేస్ ఆల్‌రౌండ‌ర్ హ‌ర్షిత్ రాణా, యువ‌ కెర‌టం గుర్నూర్ బ్రార్‌కు ఈ జట్టులో చోటు ద‌క్కింది. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. మహమ్మద్ సిరాజ్‌ను సైతం సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మొత్తంగా 15 మందిని ఈ జట్టులో ఎంపిక చేశారు.ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మ‌న్ గిల్ (కెప్టెన్), రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్య‌ర్‌ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్‌ (వికెట్ కీప‌ర్), ఇషాన్ కిష‌న్‌ (వికెట్ కీప‌ర్), వాషింగ్ట‌న్ సుంద‌ర్, కుల్‌దీప్ యాద‌వ్, నితీశ్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ప్ర‌సిధ్ కృష్ణ‌, హ‌ర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్.భారత్ vs ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్..తొలి వన్డే: జులై 14, బర్మింగ్‌హామ్రెండో వన్డే: జులై 16, కార్డిఫ్మూడో వన్డే: జులై 19, లార్డ్స్