వడ్డీ రేట్లపై ఫెడ్ కీలక ప్రకటన.. తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. రూ. 5 వేలు దిగొచ్చిన వెండి

Wait 5 sec.

US : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా మహిళలు బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేసి ధరించేందుకు ఇష్టపడుతుంటారు. పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయాల్లో డిమాండ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ కొంత కాలంగా పరిస్థితి మారిపోయింది. గతేడాది గోల్డ్ రేట్లు రికార్డు స్థాయిలో 70 శాతం వరకు పెరగ్గా.. కొనుగోళ్ల డిమాండ్ తగ్గింది. ఈ ఏడాది కూడా ఆరంభంలో పెరిగినా.. తర్వాత పశ్చిమాసియా యుద్ధం మార్చిలో ప్రారంభమైనప్పటి నుంచి క్రూడాయిల్ రేట్లు పెరగ్గా.. బంగారం ధర తగ్గుతూ వచ్చింది. పెళ్లిళ్ల సమయాల్లో కొనుగోళ్లు ఊపందుకుంటాయన్న సమయంలో విదేశీ మారకాన్ని ఆదా చేయాలని పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అందుకు అనుగుణంగా బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. దీంతో దిగుమతులు తగ్గి విదేశీ మారకం పెరుగుతుందని భావించారు. దీనికి తగ్గట్లుగానే ఇటీవల బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. దీంతో బంగారం డిమాండ్ తగ్గిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే పసిడి ధరలు భారీ స్థాయిలో దిగొచ్చాయి. ఇప్పుడు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుంచి కూడా ఊరించే ప్రకటన వచ్చింది. ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచుతున్నట్లు తెలిపింది. ఫెడ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ నేతృత్వంలో తొలిసారిగా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం జరగ్గా.. ఇక్కడ వడ్డీ రేట్లను 3.5-3.75 శాతం వద్దే ఉంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం..సాధారణంగా ఇటీవల అమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణం పెరగ్గా.. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కానీ అంతకుముందు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్‌ పెంచేందుకు సుముఖంగా ఉన్నా అధ్యక్షుడు ట్రంప్ అందుకు సిద్ధంగా లేరు. వడ్డీ రేట్లను తగ్గించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పావెల్‌ను తప్పించాల్సి వచ్చింది. ఈ క్రమంలో వార్ష్ నేతృత్వంలో కూడా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచకుండా స్థిరంగానే ఉంచేందుకు మొగ్గుచూపింది. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే డాలర్ డిమాండ్ పెరిగి బంగారం ధర తగ్గుతుంటుంది. కానీ ఇప్పుడు తగ్గించలేదు కూడా కాబట్టి.. బంగారం ధర తగ్గుతూ వస్తోంది. గతంలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించిన క్రమంలో భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతర్జాతీయంగా బంగారం ధరలు కిందటిరోజుతో పోలిస్తే బాగానే తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు కిందటి రోజు 4340 డాలర్లపైన ఉండగా ఇప్పుడు 4310 డాలర్ల దిగువకు చేరింది. సిల్వర్ కూడా తగ్గి 69 డాలర్లకు చేరింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పుంజుకొని రూ. 94.46 వద్ద ఉంది. హైదరాబాద్ బంగారం వెండి ధరలు..దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. 22 క్యారెట్ల పుత్తడి ధర వరుసగా జూన్ 16, 17 తేదీల్లో రూ. 150, రూ. 250 చొప్పున తగ్గగా ప్రస్తుతం ఉదయం 10.30 గంటల సమయంల 10 గ్రాములకు రూ. 1,38,500 వద్ద స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులం రూ. 1,51,100 వద్ద ట్రేడవుతోంది. ఇక సిల్వర్ రేటు రూ. 5 వేలు తగ్గడంతో ప్రస్తుతం కేజీకి రూ. 2.70 లక్షల వద్ద కొనసాగుతోంది.