ఆయన వ్యాఖ్యలు అవమానమే కాదు.. కులంపై దాడి.. తిరిగి మాట్లాడలేను: వంగలపూడి అనిత

Wait 5 sec.

వైసీపీ నేత, మాజీ మంత్రి .. ఏపీ హోం మంత్రి వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. మహిళలను అవమానించేలా గుడివాడ అమర్నాథ్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనపై గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత ఎక్స్ వేదికగా స్పందించారు. గుడివాడ అమర్నాథ్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకుడు బహిరంగ సమావేశంలో, కెమెరాల ముందు తనను ఉద్దేశించి మాట్లాడిన మాటలు కేవలం అవమానం మాత్రమే కాదని.. రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక మహిళను, దళితురాలిని అవమానించే లక్ష్యంతో చేసిన నీచమైన, కులతత్వ దాడిగా అనిత విమర్శించారు.ఆయన మాట్లాడిన మాటలు, భాష చాలా అవమానకరంగా ఉన్నాయన్న అనిత.. బహిరంగంగా వాటిని మాట్లడలేమన్నారు. వైసీపీ పెంచి, పోషిస్తున్న సంస్కృతికి ఈ మాటలు నిదర్శనమని విమర్శించారు. ఓ మహిళ తన సొంత కష్టంతో, దృఢ సంకల్పంతో ప్రజా సేవలో పైకి ఎదుగుతున్నప్పుడు కొంతమంది పురుషులు చేసేది ఇదేనని.. రాజకీయంగా ఆమెను ఎదుర్కోలేక దూషణలు, బెదిరింపులకు పాల్పడతారని అభిప్రాయపడ్డారు. తన జీవితంలో ఇలాంటి దాడులు చాలా ఎదుర్కొన్నానని, వాటిలో ప్రతి ఒక్కటీ కూడా తన సంకల్పాన్ని మరింత బలపరిచిందని పేర్కొన్నారు. "నేను తలవంచను. నేను బెదిరింపులకు లొంగను. నా గొంతు నొక్కేయలేరు." అంటూ ట్వీట్ చేశారు.మహిళలను శక్తి, త్యాగానికి ప్రతీకగా మనం భావిస్తామని.. అయితే బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న మహిళలపై కూడా వైసీపీ నేతలు, దూషణలు, కులపరంగా నిందలకు పాల్పడుతున్నారని అనిత ఆరోపించారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాదని.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి మహిళ గౌరవం, ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా అనిత తెలిపారు. తెలుగుదేశం పార్టీ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇవ్వడమే కాకుండా.. వచ్చే ఎన్నికలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.మహిళలను ప్రజా జీవితంలోకి రావాలని ప్రోత్సహిస్తున్న తరుణంలో, ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా తప్పుడు సంకేతాలను పంపుతాయని.. రాజకీయాలు, ప్రజా సేవలో పాల్గొనాలనుకునే మహిళా నేతలను నిరుత్సాహపరుస్తాయన్నారు. టీడీపీ మహిళలకు నాయకత్వ అవకాశాలను కల్పిస్తుంటే, వైసీపీ నాయకులు మాత్రం మహిళలపై వ్యతిరేకతను చూపిస్తూ అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మహిళకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు ఇలాంటి దూషణలను ఎంతమంది భరించాల్సి వస్తుందో? అంటూ వంగలపూడి అనిత ట్వీట్ చేశారు.