సాయికృష్ణ ఏమయ్యాడు.. ఇప్పటివరకూ ఏం జరిగింది.. ఎవరు ఏమంటున్నారు?

Wait 5 sec.

విజయవాడలోని కృష్ణలంకలోఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశమైంది. గత నెల నుంచి సాయికృష్ణ కనిపించకుండాపోగా.. దీని వెనుక పోలీసులు ఉన్నారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులే తమ బిడ్డను ఏదో చేశారని సాయికృష్ణ తల్లి వాపోతున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో పోలీసులే అతన్ని కొట్టి చంపారని అంబటి రాంబాబు వంటి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణ వ్యవహారంలో ఇప్పటి వరకూ ఏం జరిగిందనేదీ ఓసారి పరిశీలిస్తే.. మే 9 నుంచి.. గాదె సాయికృష్ణపై ఇప్పటికే పలు కేసులు ఉండటంతో పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. దీంతో అతను ప్రకాశం జిల్లాకు వలస వెళ్లిపోయాడు. సాయికృష్ణ కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం.. గాదె సాయికృష్ణను 2026 మే 9వ తేదీ మార్కాపురం వద్ద కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పోలీసులు మార్కాపురం వెళ్లి అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు తీసుకెళ్లిన తర్వాత సాయికృష్ణ తిరిగి ఇంటికి రాలేదని, అప్పటి నుంచి అతని ఆచూకీ లేదని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. కోర్టులోనూ హాజరుపరచలేదని ఆరోపిస్తున్నారు. సాయికృష్ణ కనిపించకుండా పోవటం వెనుక పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. సాయికృష్ణ తల్లి ఏం చెప్తున్నారంటే..నెలరోజులుగా తన కొడుకు ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నానని గాదె సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఐ నాగరాజు తనతో దారుణంగా మాట్లాడారని.. నీ కొడుకు చనిపోయాడనుకో అని అంటున్నారని వాపోతోంది. తన కొడుకు బతికి ఉంటే తన ముందు నిలబెట్టాలని.. లేకపోతే బూడిద అయినా ఇవ్వాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్.. పోలీసులు ఏం చెప్పారంటే..మరోవైపు సాయికృష్ణ కుటుంబానికి మద్దతుగా బెజవాడ బార్ అసోసియేషన్ రంగంలోకి దిగడంతో సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాయికృష్ణ ఆచూకీ కనిపెట్టి.. అతణ్ని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశించాలంటూ 2026 జూన్ 4న బెజవాడ బార్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సాయికృష్ణ ఎక్కడున్నాడో తెలియదని.. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసుల తరుపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. కోర్టు ముందు హాజరుపరిచేందుకు సమయం కోరటంతో కోర్టు విచారణను జూన్ 29కు వాయిదా వేసింది. ఆలోపు సాయికృష్ణను తమ ఎదుట హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. అలాగే అతని అదృశ్యం వెనుక కారణాలు చెప్పాలని స్పష్టం చేసింది. కీలక పరిణామం.. వీఆర్‌కు సీఐ నాగరాజు..కోర్టు ఆదేశాలతో పాటుగా రాజకీయంగా ఈ కేసు తీవ్రచర్చనీయాంశం కావటంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాయికృష్ణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును వీఆర్‌కు పంపిస్తూ కమిషనర్ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.ఆయన స్థానంలో కొత్త సీఐగా మురళీకృష్ణను నియమించారు. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు.. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపాయి. సాయికృష్ణను పోలీసులు లాకప్ డెత్ చేశారంటూ అంబటి రాంబాబు ఆరోపించటం కలకలం రేపింది. పోలీసులు సాయికృష్ణను తీవ్రంగా హింసించి, వేధించారంటూ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు కీలక ఆదేశాలు.. సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సాయికృష్ణ అదృశ్యం సహా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని డీజీపీని ఆదేశించారు సీఎం. ఈ ఘటనపై సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌తో దర్యాప్తు చేయించాలని.. తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.29న ఏం జరగనుంది?సాయికృష్ణ కాపు సామాజికవర్గానికి చెందిన యువకుడు కావటంతో ఈ వ్యవహారం ఏపీలో రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇదే సమయంలో జూన్ 29న హైకోర్టులో ఏం జరగనుందనేదీ ప్రాధాన్యం సంతరించుకుంది. సాయికృష్ణను పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరుస్తారా.. లేదా అనేది ఆసక్తికరంగా మారింది.