Rental Rates: ఉపాధి కోసం మెట్రో నగరాలకు వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంచి ఉద్యోగం, ఉపాధి లభించే ప్రాంతాల్లోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలి, తమకంటూ సొంత ఇల్లు ఉండాలని చాలా మంది భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ధరలు వారి కలను దూరం చేస్తున్నాయి. సగటు వేతన జీవులు ఇంటి అద్దెలే కట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఇంటి అద్దెలు వేల నుంచి లక్షల్లోకి చేరాయని, బెంగళూరు వంటి నగరాల్లో సగటు ఉద్యోగి ఉండలేని పరిస్థితులు వచ్చాయని ఇటీవల చాలా వార్తా కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఓ ఏరియా గురించి తెలుసుకుందాం. అక్కడ 3బీహెచ్ఏ అపార్ట్మెంట్ అద్దె సగటు నెలవారీ రేటు రూ. 1.56 లక్షలు దాటేసింది. అదే ముంబైలోని అంధేరి వెస్ట్ (Andheri West) ప్రాంతం. ఆ రేటు చూసి మనలాంటి సగటు వేతన జీవి నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. మరి అంతలా అద్దె ఉండేందుకు గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ముంబైలోని చాలా ప్రాంతాల్లో అద్దెలు వింటే సామాన్యుల గుండే గుభేల్మనడం ఖాయం. ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం ముంబైలని అత్యంత డిమాండ్ ఉన్న అందేరి వెస్ట్ ఏరియాలో ఒక 3 బీహెచ్ఏ ఫ్లాట్ సగటు నెలవారీ అద్దె రూ. 1.56 లక్షలు దాటేసింది. ఆ ప్రాంతం ప్రీమియం లైఫ్ స్టైల్, డిమాండ్‌కు ఈ ధరలే నిదర్శనం. బాలీవుడ్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉండడం, కోట్లల్లో డీల్స్ జరుగుతుండడంమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అంధేరి వెస్ట్ అంటే కేవలం ఒక నివాస ప్రాంతం కాదు, అదొక స్టేటస్ సింబల్. ఇక్కడ అద్దెలు భారీగా ఉంటాయి. మెట్రో కనెక్టివిటీ దీనిని ప్రీమియం ఏరియాగా మార్చాయి. ఇక్కడి వారి జీవన ప్రమాణాలు చాలా లగ్జరీగా ఉంటాయి.హైదరాబాద్‌, బెంగళూరులో ఇలాగచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రీమియం 3బీహెచ్‌కే ఫ్లాట్ అద్దె రూ. 55 వేల నుంచి రూ. 75 వేల వరకు ఉంటుంది. సెలబ్రిటీలు ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం అల్ట్రా లగ్జరీ 3బీహెచ్‌కే ఫ్లాట్ల అద్దే రూ. 90 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు ఉంది.ఇక బెంగళూరు విషయానికి వస్తే ఇందిరానగర్, కోరమంగళ వంటి ప్రీమియం ఏరియాల్లో 3బీహెచ్‌కే ఫ్లాట్ల సగటు అద్దే రూ. 70 వేల నుంచి రూ. 90 వేలుగా ఉంది. వైట్ ఫీల్డ్, సర్జాపూర్ వంటి ఐటీ హాబ్స్ లోని గేటెడ్ కమ్యూనిటీల్లో రూ. 60 వేల నుంచి రూ. 80 వేల వరకు ఉంది. బెంగళూరు అత్యంత ఖరీదైన ఇందిరానగర్ అద్దె సైతం ముంబై అంధేరి వెస్ట్ అద్దెలో సగానికి కంటే తక్కువగానే ఉందని చెప్పవచ్చు.