జీ 7లో మోదీ-ట్రంప్ హ్యాండ్‌షేక్.. 16 నెలలు తర్వాత ఫేస్ టు ఫేస్ మీటింగ్, ఏం మాట్లాడుకున్నారు?

Wait 5 sec.

ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేక్ హ్యాండ్ ఆసక్తికరంగా మారింది. 16 నెలల తర్వాత ఈ ఇద్దరు నేతలు ముఖాముఖిగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశానికి ముందు మోదీ - ట్రంప్ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇరు నేతల మధ్య ఇవాళ జరిగే ద్వైపాక్షిక సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2025 ఫిబ్రవరిలో నరేంద్ర మోదీ - డొనాల్డ్ ట్రంప్ చివరిసారిగా సమావేశమయ్యారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్‌లో వీరిద్దరి మధ్య చివరి సమావేశం జరిగింది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆ సమావేశం జరగింది. మళ్లీ 16 నెలల తర్వాత ఇద్దరు నేతలు మళ్లీ కలుకోవడంతో భారత్ - అమెరికా సంబంధాలు ఎలా మారనున్నాయో అనేది కీలకంగా మారింది. ఇటీవల కాలంలో భారత్ - అమెరికా మధ్య అంత సానుకూల సంబంధాలు లేవనేది జగమెరిగిన సత్యం. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు, భారత్ - పాక్ ఉద్రిక్తతల సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకే దారి తీశాయి. గత నెలలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ బలోపేతం అవుతున్నట్లు కనిపించాయి. మార్కో రూబియో భారత పర్యటనకు వచ్చిన సమయంలో మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైట్ హౌస్‌ను సందర్శించాలని ఆహ్వానించినట్లు సమాచారం. ట్రంప్ ఆదేశాల మేరకే ఆహ్వానం పలుకుతున్నట్లు రూబియో చెప్పినట్లు తెలుస్తోంది. అమెరికా ఇండో - పసిఫిక్ వ్యూహంలో భారత్‌ను మూలస్తంభంగా రూబియో అభివర్ణించడం విశేషం. జీ7 సదస్సుగా సాగిన ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో తొలుత ఫ్రాన్స్‌లో ఆయన పర్యటించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడితో సమావేశం అనంతరం స్లోవేకియాలో పర్యటించి అక్కడి అధ్యక్షుడు, ప్రధానితో సమావేశమయ్యారు. జీ 7 సదస్సులో ప్రపంచ అధినేతలతోనూ మోదీ కీలక అంశాలపై చర్చించడం విశేషం.