‘నువ్వులేక నేనులేను’ టుడే ఎపిసోడ్: శీనయ్య విషయం తెలిసి ఆగ్రహించిన రాధ.. విక్రమ్‌కి వార్నింగ్.. చిచ్చు పెట్టి సంబరపడ్డ ప్రియ, దమయంతి

Wait 5 sec.

శీనయ్యకి జైల్లో గాయాలు అయ్యాయ్ అని తెలియడంతో రామలింగంతో కలిసి విక్రమ్ బయల్దేరుతాడు. ఈ విషయాన్ని వేరేలా చెప్పి.. రాధను బాధపెడుతుంది ప్రియ. నువ్వంటే ఇష్టం లేదు.. నిన్ను బయటకు తీసుకు వెళ్లడం ఇష్టం లేదు కాబట్టే రామలింగంతో కలిసి మా బావ బయటకు వెళ్లాడు.. కావాలంటే నువ్వు ఫోన్ చెయ్యి.. లిఫ్ట్ చేయడు అని రాధకి ప్రియ లేనిపోని మాటలు చెబుతుంది. ఇక ఎంతకీ విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రాధ బాధపడుతుంది. నువ్వు ఎప్పటికీ మా బావకి భార్యవి కాలేవు.. ఈ ఇంటికి కోడలివి కాలేవు.. నేనే అవుతాను అని రాధతో అంటుంది ప్రియ. ఇక విక్రమ్ చేసిన పనికి రాధ కుమిలి కుమిలి ఏడ్చేస్తుంటుంది.మరో వైపు జైల్లో శీనయ్య జరిగిన విషయాన్ని దాచాలని చూస్తాడు. కానీ విక్రమ్ మాత్రం పసిగడతాడు. జారి పడితే ఇలా జరిగిందా? ఎవరైనా కొట్టారా? అని విక్రమ్ అడుగుతాడు. దీంతో అక్కడి జైలర్ జరిగిందంతా చెబుతాడు. ఏం కాదు.. ఇకపై జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పి వెళ్లిపోతాడు విక్రమ్. విక్రమ్ చేసిన పనిని తల్చుకుంటూ ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటుంది. హాల్లోకి విక్రమ్ రావడంతో.. రాధ తన రచ్చ షురూ చేస్తుంది. ఎక్కడికి వెళ్లారు.. ఎందుకు చెప్పలేదు.. నేను ఏమైనా మా పుట్టింటి ఫంక్షన్‌కి తీసుకు వెళ్లమని అడిగానా? అత్తయ్య గారు చెప్పినప్పుడే.. రాధతో వెళ్లడం ఇష్టం లేదని అనొచ్చు కదా? అని విక్రమ్ మీద రాధ అరిచేస్తుంటుంది.ఇంతలో అందరూ వస్తారు. సునంద, నంద గోపాల్ కూడా విక్రమ్‌ని నిలదీస్తారు. ఎక్కడికి వెళ్లావో చెప్పురా అని అంటారు. చెప్పకూడని, చెప్పుకోలేని చోటుకి వెళ్లి ఉంటాడని దమయంతి, ప్రియ వెటకారంగా మాట్లాడుతుంటారు. దీంతో విక్రమ్‌కి అండగా రామలింగం నిలబడి జరిగిందంతా చెబుతాడు. మా నాన్నకు ఇంత జరిగితే నాకు చెప్పరా? అని మళ్లీ విక్రమ్‌నే తిడుతుంది రాధ. ఇదేంటి నిజం చెప్తే కూల్ అవుతుందని అనుకుంటే.. ఇలా ఫైర్ అవుతోందని రామలింగం అనుకుంటాడు. మా నాన్నకు సంబంధించిన విషయాలు దాచి పెడితే బాగుండదు అని విక్రమ్‌కి రాధ వార్నింగ్ ఇస్తుంది.ఇద్దరి మనుషుల మధ్య చిచ్చ పెడితే ఇంత కిక్క్ ఉంటుందా? మామ్ అని ప్రియ సంబరపడుతుంది. నువ్వు నా రాజకీయ వారసురాలివి.. విడగొట్టడం, కలపడం నీకు బాగా తెలుసు అని దమయంతి అంటుంది. నేను ఈ ఇంట్లో కోడలిగా రాధ మీద పోటీ చేస్తున్నా.. ఇలానే ఆ ఇద్దరి మధ్య గొడవలు పెట్టి.. చివరకు నేనే కోడలిగా గెలుస్తా.. ప్రమాణ స్వీకారం చేస్తా అని ప్రియ అంటుంది. దెబ్బలు తగిలాయ్ అన్న చిన్న విషయం దాచి పెడితేనే విక్రమ్‌ని అంతలా తిట్టింది.. అసలు నిజం తెలిస్తే ఏం చేస్తుందో.. నేను చెబుతాను కదా అని దమయంతి తనలో తాను అనుకుంటుంది.రాధ తినకుండా కూర్చుంటుంది. భోజనం తీసుకు వచ్చి తినమని అంటాడు విక్రమ్. మీ నాన్నకి కూడా ఇలానే జరిగితే.. ఎలా ఉన్నారో చూడకుండా ఉండగలవా? కడుపు నిండా తినగలవా? అని రాధ అంటుంది. ఇదంతా సునంద, నంద గోపాల్ వింటూ బాధపడతారు. మా నాన్నని చూసే వరకు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టను అని రాధ అంటుంది. దీంతో శీనయ్యతో రాధను ఫోన్లో మాట్లాడేలా చేస్తాడు విక్రమ్. నేను బాగానే ఉన్నాను అమ్మా.. నాకు ఇలా జరిగిందంటే నువ్వు బాధపడతావ్ అని నేనే చెప్పొద్దు అనుకున్నా.. అల్లుడు కూడా నాలానే ఆలోచించాడు.. నువ్వు బాధపడొద్దు అని నీకు చెప్పలేదు.. ఇలాంటి భర్త దొరకడం నీ అదృష్టం అమ్మా అని శీనయ్య అంటాడు. అంతలో ఎపిసోడ్ పూర్తవుతుంది.