పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో చెట్ల కింది, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు.ఆదివారం రోజు శ్రీకాకుళం, పార్వీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి వర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదివారం రోజు వరకు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 3.8 సెంటీమీటర్లు, గుర్లలో 3.5 సెంటీమీటర్లు, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 3.3 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా లావేరులో 3.2 సెంటీమీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో భారీ వర్షం ముంచెత్తింద. కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలో 10.06 సెం.మీ. భారీ వర్షం పడింది. ఉమ్మడి అనంతపురం జిల్లా కుండపోత వాన పడింది. వర్షాలతో పాటుటా పిడుగుల పడే ప్రమాదం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు, పిడుగుల సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడవద్దని సూచించారు. ఈ వర్షాలతో వాగులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉందని.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. పిడుగులు, ఈదురుగాలుల రైతులు, పొలాల్లో పనిచేసేవారు, పశువులకాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అంతేకాదు ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగిపోతాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.