బ్యాంక్ ప్రైవేటీకరణ? భారీగా వాటా విక్రయిస్తున్న కేంద్రం.. బ్లాక్ డీల్స్.. దెబ్బకు 20 శాతం దూసుకెళ్లిన షేరు!

Wait 5 sec.

: కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా పలు ప్రభుత్వ బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంస్థలు సహా తమ నియంత్రణలో ఉన్నటువంటి సంస్థల్లో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ సహా ఆస్తుల నగదీకరణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల చాలా వరకు ప్రభుత్వ సంస్థల్లో వాటాల్ని విక్రయించేందుకు ఓఎఫ్ఎస్ తీసుకొచ్చింది. స్వల్పంగా వాటాల్ని విక్రయించింది. ఇందులో ఐఆర్ఎఫ్‌సీ, BHEL సహా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా, NHPC, NLC ఇండియా తాజాగా జీఐసీ ఆర్‌ఈ సంస్థల్లో ఓఎఫ్ఎస్ విజయవంతంగా నిర్వహించింది. వీటిల్లో చాలా వరకు మంచి రెస్పాన్స్ లభించగా ఖజానాకు వేల కోట్లు వచ్చి చేరాయి. ఇదే జోష్‌లో కేంద్రం మరిన్ని ప్రణాళికలకు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్రం ఎప్పటినుంచో ఐడీబీఐ బ్యాంకులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టేందుకు చూస్తోంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం సహా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు (LIC) మెజార్టీ వాటా ఉన్నప్పటికీ ఇది ప్రైవేట్ బ్యాంకుగానే ఉంది. కానీ ఇప్పుడు దీనిని పూర్తి స్థాయిలో ప్రైవేటుపరం చేసేందుకు పెట్టుబడుల ఉపసంహరణకు గతంలోనే బిడ్స్ ఆహ్వానించింది. కానీ ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వ్ ప్రైస్ కంటే తక్కువ ధరకు బిడ్స్ దాఖలు కావడంతో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిసింది.కొత్త మార్గాల అన్వేషణ..అయితే ఇప్పుడు మళ్లీ ఒక్కసారిగా కేంద్రం ఈ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రం కొత్త మార్గాల్ని అన్వేషిస్తుందంటూ వార్తలు వచ్చాయి. వ్యూహాత్మక వాటాల విక్రయానికి కేంద్రం సిద్ధమవుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరానికల్లా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుందని తెలుస్తోంది. కొన్ని పరిస్థితుల్లో రిజర్వ్ ధర కంటే తక్కువ ధరకు దాఖలైన ఆఫర్లను అంగీకరించేందుకు వీలు కల్పించేలా టెండరింగ్ ఫ్రేమ్ వర్క్ కింద ఉన్న చట్టపర నిబంధనల్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దూసుకెళ్లిన ఐడీబీఐ షేర్లు..ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత ఐడీబీఐ బ్యాంక్ షేర్లు భారీగా దూసుకెళ్లాయి. జూన్ 17 సెషన్‌లో ఐడీబీఐ బ్యాంకు షేరు ఇంట్రాడేలో ఒక దశలో 20 శాతం పెరిగి రూ. 92.25 వద్ద సెషన్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. అంతకుముందు సెషన్‌లో రూ. 77.15 వద్ద క్లోజ్ అవగా ఆరంభంలో స్వల్ప లాభంలోనే ప్రారంభం కాగా ప్రైవేటీకరణ వార్తలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపగా షేరు దూసుకెళ్లింది. బ్యాంక్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 97.28 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 118.38 కాగా.. కనిష్ట ధర రూ. 61.01 గా ఉంది. ఈ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్ఐసీకి 49.24 శాతం వరకు ఉంది. ఈ రెండింట్లో కలిపి దాదాపు 60 శాతం వాటాను విక్రయించాలని చూసి బిడ్స్‌కు ఆహ్వానించాయి. ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, ఎమిరేట్స్ NBD వంటి సంస్థలు బిడ్స్ కాస్త తక్కువ ధరకు దాఖలు చేయగా తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పుడు వీటిని ప్రభుత్వం తిరిగి పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఈ క్రమంలోనే అధిక వాల్యూమ్స్ సహా భారీ బ్లాక్ డీల్స్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో షేరు ధర రికార్డు స్థాయిలో పెరిగిందని భావిస్తున్నారు.