లక్ అంటే వీళ్లదే.. ఏడాదికే లక్షకు రూ.5.70 లక్షలొచ్చాయ్.. ఇప్పుడు 100 షేర్లకు 200 షేర్లు ఫ్రీగా ఇస్తోన్న కంపెనీ!

Wait 5 sec.

Jewellery Stock: స్మాల్ క్యాప్ కేటగిరిలోని జ్యూవెలరీ సెక్టార్ కంపెనీ డివైన్ హీరా జ్యూవెలర్స్ లిమిటెడ్ (Divine Hira Jewellers Limited) తమ షేర్ హోల్డర్లకు ఇటీవలే అదిరే శుభవార్త చెప్పింది. కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 2:1 రేషియోలో జారీ చేయాలని నిర్ణయించారు. ఈ బోనస్ ప్రకారం 1 షేరు కొనుగోలు చేస్తే అదనంగా 2 ఈక్విటీ షేర్లు బోనస్ రూపంలో వస్తాయి. మరోవైపు ఈ కంపెనీ షేర్ గత ఏడాదిలోనే ఏకంగా 472 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది. మరి ఈ స్టాక్ బోనస్ ఇష్యూ, స్టాక్ పని తీరు గురించిన వివరాలు తెలుసుకుందాం. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో తమ షేర్ హోల్డర్లకు 2:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం లభించింది. దీని ప్రకారం రికార్డు డేట్ నాటికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని కొనుగోలు చేసి డీమ్యాట్ ఉచితంగా బోనస్ రూపంలో జారీ చేస్తారు. ఈ బోనస్ షేర్లను పొందడానికి అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు అతి త్వరలో ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. చివరి ట్రేడింగ్ సెషన్ లో డివైన్ హీరా జ్యూవెలర్స్ షేరు 2.80 శాతం నష్టంతో రూ. 312 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 346.50 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 50.10 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 4 శాతం నష్టపోయింది. గత నెల రోజుల్లో 8 శాతం తగ్గింది. గత ఆరు నెలల్లో 89 శాతం లాభాన్ని అందించింది. గత ఏడాది కాలంలో 472 శాతం లాభాన్ని అందించింది. అంటే ఏడాది క్రితం ఇందులో రూ.1 లక్ష పెట్టి షేర్లు కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.5.70 లక్షలకు పైగా అయి ఉంటుంది. గత 5 ఏళ్ల కాలంలో 264 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 407 కోట్లుగా ఉంది.అయితే, ఈ కథనం కేవలం సమాచారం అందించేందుకే. స్టాక్ మార్కెట్లో హైరిస్క్ ఉంటుంది. ఎంచుకునే స్టాక్ గురించి ముందే పూర్తిగా తెలుసుకోవాలి. తమ రిస్క్ సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలు, స్టాక్ పనితీరు వంటి చాలా అంశాలను పరిశీలించడంతో పాటు మార్కెట్ నిపుణుల సలహాలు తీసుకున్నాకే నిర్ణయం తీసుకోవడం మంచిది.