భారతీయుల్ని టార్గెట్ చేసిన అమెరికా.. రాత్రికి రాత్రే ఏఐ యాక్సెస్ రద్దు!

Wait 5 sec.

భారతీయుల్ని అమెరికా పదే పదే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నుంచి అమెరికాలో ఉండే విదేశీయుల్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. వీసా ఆంక్షల్ని కఠినతరం చేసిన అమెరికా.. ఆ తర్వాత విదేశీయులపై ఒక్కొక్క అస్త్రం ప్రయోగిస్తోన్న అమెరికా తాజాగా అత్యాధునిక ఏఐ మోడళ్ల యాక్సెస్‌ను రాత్రికి రాత్రే నిలిపివేసింది. అమెరికా తన అత్యాధునిక ఏఐ మోడళ్లకు సంబంధించిన యాక్సెస్‌ను ప్రపంచంలోని అన్ని విదేశీ పౌరులకు ముందస్తు నోటీసు లేకుండానే నిలిపివేసింది. భారత్ వంటి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న దేశానికి స్వదేశీ ఏఐ ఎంత అవసరమో ఈ రోజున అర్థమవుతోందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా భారత్ మేల్కొని అత్యాధునిక ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని యువత కోరుతున్నారు. జాతీయ భద్రతా కారణాలను చూయిస్తూ అమెరికా ప్రభుత్వం విదేశీ పౌరులందరికీ ఫేబుల్ 5, మైథోస్ 5 యాక్సెస్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది కేవలం అమెరికా బయట ఉండేవాళ్లకే కాకుండా, అమెరికాలో ఉన్న విదేశీ పౌరులకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగానే ఈ సేవలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ఏఐ సంస్థ ఆంధ్రోపిక్ తెలిపింది. వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని సంస్థ పేర్కొంది. అమెరికా ప్రభుత్వం ఆదేశాల మేరకు సాయంత్రం వేళ ఈ సేవలు రద్దు చేయాల్సి వచ్చిందని ఏఐ సంస్థ స్పష్టం చేసింది. అమెరికా ప్రభుత్వం, బ్రిటన్ ఏఐ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్, ప్రైవేట్ సంస్థలు, అంతర్గత భద్రతా బృందాలు గతంలో ఫేబల్ 5 భధ్రతపై కొన్ని వేల గంటలపాటు పరీక్షలు నిర్వహించాయని కంపెనీ వెల్లడించింది. ప్రభుత్వ ఆదేశాలు చట్టపరంగా పాటిస్తున్నప్పటికీ ఇలా నిలిపివేయడం సరైన విధానం కాదని ఆంధ్రోపిక్ కంపెనీ అభిప్రాయపడింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించింది. ఇది కేవలం ఒక చిన్న మిస్టేక్‌గానే తీసుకోవాలని, త్వరలోనే సేవలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆంథ్రోపిక్ తెలిపింది.