‘సునీల్ కుమార్ ఆరెస్సెస్ అని అర్థమైపోయింది’.. హర్ష కుమార్ ఆరోపణలు.. RRR కోవర్ట్ అంటూ ఐపీఎస్ అధికారి కౌంటర్..!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్ సమావేశానికి ఒక్క పీవీ సునీల్ కుమార్‌కు మాత్రమే ఎందుకు ఆహ్వానం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. అందువల్లే ఆయన్ను ప్రభుత్వం అరెస్ట్ చేయలేక పోతుందేమోనని, ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని అనుమానాలు వ్యక్తం చేశారు.గతంలో ఆర్ఎస్ఎస్ సమావేశానికి హాజరై.. అక్కడ తాను గ్రహించిన విషయాలను ఫిబ్రవరి 10న పీవీ సునీల్ కుమార్ ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు. ఆ పోస్టు స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసిన హర్ష కుమార్.. ఆయన ఆర్ఎస్ఎస్ అని అర్థమైపోతుందన్నారు. అనంతరం ఫేస్ బుక్‌లో వీడియో పోస్టు చేసిన హర్ష కుమార్.. ముందు జాగ్రత్తగా జాతిని హెచ్చరిస్తూ తాను ఈ పోస్టు చేశానన్నారు.‘‘పీవీ సునీల్ నాకు బాగా తెలిసినాయనే. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఒకసారి నా దగ్గరికి వచ్చారు. గుంటూరు ఐజీ ఖాళీగా ఉందని, వేయించమని కోరారు. నేను సీఎంతో మాట్లాడి వేయించాను. వేయించలేదని బైబిల్ పట్టుకొని ప్రమాణం చేయమని సునీల్ కుమార్‌ను చెప్పమనండి. తర్వాత మా మధ్య సంబంధాలు లేవు. .. అది తప్పు కాబట్టి నేను రఘురామ వైపు మాట్లాడి .. సునీల్ కుమార్‌ తీరును తప్పుబట్టాను. పీవీ సునీల్ కుమార్ ఆర్ఎస్ఎస్ గురించి చేసిన పోస్టును ఎవరో నాకు పంపించారు. బౌద్ధ ఆచారాల ప్రకారం సునీల్ కుమార్ తండ్రి అంత్యక్రియలు నిర్వహించారని నాతో ఒకరు చెప్పారు. దీంతో చింతలపూడిలో నాకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి అడిగితే.. బౌద్ధ సంప్రదాయం ప్రకారం సునీల్ తండ్రి అంత్యక్రియలు చేసిన మాట నిజమేనని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఇతణ్ని ప్రమోట్ చేస్తుందనే అనుమానం వచ్చేలా నాకు చాలా పోకడలు కనిపించాయి. అందుకే జాతిని ముందే మేల్కొలపాలనే ఉద్దేశంతోనే ఈ పోస్టు పెట్టాను. సునీల్ కుమార్ తన భార్యను హింసించడంతో ఆమె కేసు పెట్టింది. ఆయనపై ఆర్ఆర్ఆర్‌వి కాకుండా చాలా కేసులు ఉన్నాయి’ అని హర్ష కుమార్ వ్యాఖ్యానించారు.మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసిన పోస్టు పట్ల సునీల్ కుమార్‌ పరోక్షంగా స్పందించారు. ‘పైకి ట్రిపుల్ ఆర్‌ (రఘురామ కృష్ణరాజు)తో పోరాడుతున్నట్లు నటిస్తూ.. అతని ఏజెంట్లుగా పని చేస్తున్నవాళ్లు దొరికిపోతున్నారు. వీళ్లను ఏం చేయాలో జాతికి తెలుసు’ అని సునీల్ కుమార్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.ఈ పోస్టు కింద సునీల్ కుమార్ అభిమానులు చేస్తున్న కామెంట్స్‌ను బట్టి ఆయన చేసిన ఈ పోస్టు హర్ష కుమార్‌ను ఉద్దేశించేదనని అర్థమవుతోంది. ‘కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రణబ్ ముఖర్జీ లాంటి పెద్ద పెద్ద లీడర్లు సైతం ఆర్ఎస్ఎస్ ఆహ్వానం మేరకు ఆర్ఎస్ఎస్ సభలకు హాజరయ్యారని.. అంత మాత్రాన ప్రణబ్ ముఖర్జీ బీజేపీ మనిషి అయ్యారా? అప్పుడు హర్ష కుమార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వారిని విమర్శించలేని హర్ష కుమార్ గత చరిత్ర మరచి పీవీ సునీల్ గారి మీద బురద జల్లుతున్నారు. హర్ష కుమార్, ఆయన కుమారుడి రాజకీయ పీఠాలు కదులుతాయని భయమా? లేదా ఆర్ఆర్ఆర్‌కు కోవర్టులుగా పని చేస్తున్నారా?’ అని ప్రభుదాస్ అనే వ్యక్తి పీవీ సునీల్ కుమార్ పోస్టు కింద కామెంట్ చేశారు... చర్చికి వెళ్లినంత మాత్రాన, ఇంట్లో బైబిల్ ఉన్నంత మాత్రం క్రిస్టియన్లు కారని.. బాప్టిజం తీసుకున్న వారే క్రైస్తవులు అవుతారని వ్యాఖ్యానించారు. తన తండ్రి అంత్యక్రియలను క్రైస్తవ పద్ధతిలోనే చేశానని.. దమ్ముంటే తన ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయాలని సవాల్ చేశారు. ఈ మీటింగ్ సక్సెస్ కావడంతో రఘురామ కోవర్టులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.