: పదవీ విరమణ తర్వాత మీ విశ్రాంత జీవితాన్ని అత్యంత సౌకర్యవంతంగా , 100కు వంద శాతం ఆర్థిక భద్రతతో మార్చేందుకు ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఒక సూపర్ పెన్షన్ పాలసీని అందిస్తోంది. ఈ పాలసీ ప్రయోజనం ఏమిటంటే మీరు మీ జీవితంలో ఒక్కసారి పెట్టుబడి పెట్టి జీవితమంతా ప్రతి నెలా స్థిరమైన హామీతో కూడిన రాబడిని పెన్షన్ మాదిరిగా పొందవచ్చు. మీరు పెట్టే పెట్టుబడిని బట్టి మీకు వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది. మరి ఆ వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. సింగిల్ లైఫ్ , జాయింట్ లైఫ్ ఆప్షన్లుఈ సూపర్ పెన్షన్ పాలసీ విభిన్న అవసరాలకు అనుగుణంగా రెండు ఆప్షన్లు కలిగి ఉంది. మొదటిది సింగిల్ లైఫ్ ప్లాన్. ఈ విధానంలో పెట్టుబడి పెట్టే డబ్బు జీవితాంతం పెన్షన్ రూపంలో మీ బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణిస్తే పెట్టుబడి మొత్తం సొమ్మును ఎటువంటి నష్టం లేకుండా కుటుంబ సభ్యులకు లేదా నామినీకి ఇస్తారు. ఇక రెండవది 'జాయింట్ లైఫ్' ప్లాన్. ఇది ప్రత్యేకంగా పెళ్లైన జంటల కోసం రూపొందించారు. ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెడితే భార్యాభర్తలలో ఒకరు మరణించినప్పటికీ, జీవించి ఉన్న వారి జీవిత భాగస్వామికి ఏ ఆటంకం లేకుండా జీవితాంతం పింఛను వస్తుంది. ఆ తర్వాత వారిద్దరూ మరణించిన సందర్భంలో అసలు పెట్టుబడి మొత్తం నామినీకి ఇస్తారు. నెలకు రూ.11,400 ఎలా?ఉదాహరణకు మీ వయస్సు 45 సంవత్సరాలనుకుందాం. ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పాలసీని కొనుగోలు చేసి సింగిల్ లైఫ్ ఆప్షన్‌ ఎంచుకున్నారు అనుకుందాం. మొత్తం రూ. 10 లక్షలు ఒకేసారి జమ చేయాల్సి ఉంటుంది. మీ పెట్టుబడి నుంచి 12 సంవత్సరాల తర్వాత (అంటే మీకు 57 ఏళ్లు వచ్చాక) పదవీ విరమణ పెన్షన్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటే, మీకు 57 ఏళ్ల వయస్సు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఏటా రూ. 1,42,500 వరకు రాబడి వస్తుంది. నెల వారీ వారీగా చూస్తే సుమారుగా రూ. 11,400 లభిస్తుంది. మీ చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ డబ్బు వస్తూనే ఉంటుంది. అంతిమంగా మీ పెట్టుబడి రూ. 10 లక్షలు కూడా సురక్షితంగా మీ వారసులకు ఇస్తారు. ఒకవేళ మీరు దంపతులు కలిసి 'జాయింట్ లైఫ్' ఎంచుకుని రూ. 10 లక్షల మొత్తాన్ని పెట్టుబడి పెడితే 12 సంవత్సరాల డెఫర్‌మెంట్ పీరియడ్ తర్వాత సంవత్సరానికి రూ. 1,33,400 పింఛను వస్తుంది. దీని ప్రకారం చూస్తే నెల నెలా రూ. 10,672 వస్తుంది. భార్యాభర్తలిద్దరికీ వృద్ధాప్యంలో సమాన ఆర్థిక భద్రత లభిస్తుంది.వయోపరిమితి , కనీస పెట్టుబడి వివరాలివే వారు ఎవరైనా సులభంగా పొందవచ్చు. ఈ పథకంలో చేరడానికి కనీస పెట్టుబడి రూ. 1,50,000 గా నిర్ణయించారు. దీని ద్వారా పాలసీదారుకి ఏడాదికి రూ. 12,000 పెన్షన్ వస్తుంది. ఇందులో గరిష్ఠ పెట్టుబడిపై పరిమితులు లేవు.